Begin typing your search above and press return to search.

50కథలకు నో చెప్పిన స్టార్ హీరో.. 'షాక్'లో ఫ్యాన్స్!

By:  Tupaki Desk   |   29 April 2020 1:06 PM GMT
50కథలకు నో చెప్పిన స్టార్ హీరో.. షాక్లో ఫ్యాన్స్!
X
టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జునకు కథల కొరత ఏర్పడిందట. తను ఎన్నో ఆశలు పెట్టుకొని నటించిన మన్మధుడు2 సినిమా ప్లాప్ అవ్వడంతో ఇప్పుడు నాగార్జున తదుపరి సినిమాకు భారీ గ్యాప్ తీసుకున్నాడు. ఇక కొత్త డైరెక్టర్ సాల్మన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'వైల్డ్ డాగ్' సినిమాను ఎలాంటి ఆర్భాటం లేకుండా సైలెంట్ గా చేస్తున్నాడట. 2016లో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయనా సూపర్ హిట్ తర్వాత.. ఊపిరి సినిమా యావరేజ్ లిస్టులో చేరింది. అప్పటినుండి మొన్నటి దేవదాస్, మన్మధుడు2 వరకు నాగార్జున సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర నిరాశ పరిచాయి. ఇక వైల్డ్ డాగ్ తో పాటుగా మరో సినిమా చేసేందుకు కొత్త కథలు వింటున్నాడట నాగ్. సీనియర్స్ నుండి యంగ్ డైరెక్టర్స్ వరకు దాదాపు 50 కథల వరకు నాగార్జునకు వినిపించారట.

అందులో 45 కథలు నచ్చలేదని చెప్పేశాడట. అన్ని కథలు వింటే కేవలం 5 మాత్రమే నచ్చాయా.. అని అక్కినేని ఫ్యాన్స్ బిత్తరపోతున్నారు. ఈసారి బాక్స్ ఆఫీస్ బరిలో దిగితే గట్టి కాన్సెప్ట్ తోనే దిగాలని కసితో ఉన్న నాగార్జున కథల విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవడం లేదని తెలుస్తుంది. మరోపక్క సోగ్గాడే చిన్ని నాయనా సీక్వల్ గా అనుకున్న బంగార్రాజు సినిమా కూడా సెట్ మీదకు వెళ్లేట్టు కనిపించడం లేదు. సోగ్గాడితో హిట్ అందుకున్న డైరెక్టర్ నేలటిక్కెట్టుతో ప్లాప్ అందుకోవడంతో ఆయన మీద నమ్మకం ఉంచట్లేదని తెలుస్తుంది. మరి ఆశలు పెట్టుకున్న వైల్డ్ డాగ్ అంచనాలను రీచ్ అయి నాగార్జునకు హిట్ ఇస్తుందో లేదో చూడాలి. ఎప్పుడు ప్రయోగాలకు ముందుండే నాగార్జున ఇక మీదట ప్రయోగాలకు చేయకూడదని భావిస్తున్నట్లు సమాచారం. మరి నిజాలేంటో తెలియాలంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే!