Begin typing your search above and press return to search.
అప్పుడు ఆలోచన లేదన్న నాగ్ ఇప్పుడు మాట మార్చాడే!
By: Tupaki Desk | 4 April 2021 10:35 AM GMTప్రస్తుతం అన్ని భాషల్లో కూడా బయోపిక్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే పలువురు ప్రముఖుల బయోపిక్ లు వచ్చాయి. అందులో కొన్ని సూపర్ హిట్ అవ్వగా కొన్ని నిరాశ పర్చాయి. సినీ పరిశ్రమకు చెందిన వారి బయోపిక్ లు కూడా వెండి తెరపై వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాగార్జునను కొన్నాళ్ల క్రితం ఒక మీడియా సమావేశంలో మీ నాన్న గారి బయోపిక్ ను తీసే ఆలోచన ఏమైనా ఉందా అంటూ ప్రశ్నించిన సమయంలో లేదంటూ ఆయన నుండి సమాధానం వచ్చింది. ఎవరి జీవితం అయితే డ్రమటిక్ గా ఉంటుందో వారి బయోపిక్ తీస్తే బాగుంటుంది. నాన్న గారి జీవితంలో అంతటి డ్రమటిక్ అంశాలు అంతగా లేవు. ఆయన జీవితం మొత్తం సాఫీగా సాగింది. కనుక బయోపిక్ ఆలోచన చేయడం లేదు అంటూ మన్మధుడు 2 ప్రమోషన్ సమయంలో చెప్పిన నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా ప్రమోషన్ సమయంలో రూటు మార్చాడు.
వైల్డ్ డాగ్ సినిమా ప్రమోషన్ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ మరోసారి ఆయన ఏయన్నార్ బయోపిక్ గురించి స్పందించారు. నాన్న గారి బయోపిక్ ఆలోచన ఉంది. కాని అది ఎప్పుడు ఎలా ఉంటుంది అనే విషయంలో స్పష్టత లేదన్నాడు. బయోపిక్ అంటూ ఏదైనా తప్పులు చేస్తామేమో అన్న భయం ఉంది. 'మనం' సినిమా సమయంలో కూడా మొదట భయపడ్డాం. భయం వల్ల జాగ్రత్త పడతాం. జాగ్రత్త వల్ల తప్పకుండా మంచి ఫలితం వస్తుంది అన్నాడు. నాగార్జున మాటలను బట్టి చూస్తుంటే ఇంకొన్నాళ్లకైనా ఏయన్నార్ జీవితాన్ని వెండి తెరపై చూస్తామనిపిస్తుంది. ఏయన్నార్ బయోపిక్ చేస్తే ఏయన్నార్ పాత్రను ఎవరు చేస్తారా అంటూ ఇప్పటి నుండే అక్కినేని అభిమానులు చర్చించుకుంటున్నారు.