Begin typing your search above and press return to search.

నాగ్ ది ఘోస్ట్‌ .. హాలీవుడ్ మూవీస్ తో లింక్‌!

By:  Tupaki Desk   |   19 Aug 2022 8:30 AM GMT
నాగ్ ది ఘోస్ట్‌ .. హాలీవుడ్ మూవీస్ తో లింక్‌!
X
నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తార్‌ దర్శకత్వంలో రూపొందిన ది ఘోస్ట్‌ సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది. ఇటీవలే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ది ఘోస్ట్‌ సినిమాను అక్టోబర్ మొదటి వారంలో విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చిన విషయం తెల్సిందే. తాజాగా ఈ సినిమాలో వాడిన అత్యంత విభిన్నమైన ఖడ్గం గురించిన ఒక వీడియోను విడుదల చేశారు.

సినిమా ప్రమోషన్ లో భాగంగా విడుదల అయిన ఆ వీడియో సినిమా పై ఆసక్తి ని పెంచడంలో సక్సెస్ అయ్యింది. ఇదే సమయంలో ఈ సినిమా భారీ యాక్షన్‌ సినిమాలను తలపిస్తుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. కొందరు సోషల్‌ మీడియాలో ది ఘోస్ట్‌ పోస్టర్స్ మరియు ఈ ప్రమోషనల్ వీడియోను చూస్తూ ఉంటే హాలీవుడ్‌ లో వచ్చిన కొన్ని సినిమాలు గుర్తుకు వస్తున్నాయని అంటున్నారు.

హాలీవుడ్‌ లో గతంలో వచ్చిన పలు యాక్షన్‌ సన్నివేశాలు ది ఘోస్ట్‌ లో చూస్తున్నట్లుగా అనిపిస్తుంది అంటూ మరికొందరు ఇంగ్లీష్‌ సినిమా పేర్లతో కలిపి మరీ చెప్పుకొచ్చారు. యాక్షన్‌ సినిమాలు అనగానే చాలా మంది హాలీవుడ్ సినిమాలతో పోల్చి చూడడం కామన్ విషయం. ఏదో ఒక సినిమా తాలూకు ఇన్‌ పుట్స్ కచ్చితంగా ఉంటాయి అనేది కొందరి అభిప్రాయం.

ది ఘోస్ట్‌ సినిమా ఏ హాలీవుడ్ సినిమాకు ఇన్సిపిరేషన్‌ అయినా.. లేదా కాపీ అయినా వచ్చే నష్టం ఏమీ లేదు. నాగార్జున ఈ సినిమా తో చాలా రోజుల తర్వాత ఒక కమర్షియల్‌ హిట్‌ ను దక్కించుకోబోతున్నాడు అంటూ అక్కినేని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బంగార్రాజు సినిమా తర్వాత మళ్లీ అదే స్థాయి విజయాన్ని ది ఘోస్ట్‌ దక్కించుకుంటుందా అనేది చూడాలి.