Begin typing your search above and press return to search.
నాగార్జునలో ఆ ఉత్సాహం లేదే..
By: Tupaki Desk | 29 March 2021 4:13 AM GMTటాలీవుడ్ సీనియర్ హీరోల్లో సినిమా వేదికల మీద చాలా ఉత్సాహంగా, సరదాగా మాట్లాడేదెవరంటే ముందు అక్కినేని నాగార్జున పేరే చెప్పుకోవాలి. సీనియర్ హీరోల్లో నాగ్‌తో పోలిస్తే చిరు కాస్త పర్వాలేదు కానీ.. విక్టరీ వెంకటేష్ మాటల కోసం తడబడుతుంటాడు. నందమూరి బాలకృష్ణ సంగతి చెప్పాల్సిన పని లేదు. కానీ నాగ్ మాత్రం చాలా సునాయాసంగా మాట్లాడేస్తుంటాడు. ఆయన ప్రసంగాలు చాలా ఎంటర్టైనింగ్‌గా కూడా ఉంటాయి. కానీ నాగ్ కొత్త సినిమా ‘వైల్డ్ డాగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో మాత్రం నాగ్‌లో మునుపటి ఉత్సాహం కనిపించలేదు. ఆయనలో కాన్ఫిడెన్స్ లోపించినట్లుగా కనిపించింది. వరుస ఫెయిల్యూర్లు, అంతకంతకూ మార్కెట్ పడిపోతుండటం, ‘వైల్డ్ డాగ్’కు కూడా ఆశించినంత క్రేజ్ రాకపోవడం ఆయనపై ప్రభావం చూపించాయో ఏమో తెలియదు కానీ.. నాగ్ తన శైలికి భిన్నంగా కనిపించాడు.
ఎన్నడూ లేని విధంగా నాగ్ చాలా సీరియస్‌గా, కొంచెం ఎమోషనల్‌గా కూడా మాట్లాడాడు. ‘వైల్డ్ డాగ్’లో ఏసీపీ విజయ్ కుమార్ పాత్ర నచ్చే ఈ సినిమా చేశానని చెప్పిన నాగ్.. ఆ పాత్రకు, తనకు వ్యక్తిత్వ పరంగా పోలికలు ఉన్నాయన్నాడు. భయం అంటే తెలియని ఆ అధికారి మనస్తత్వం తనకు దగ్గరగా ఉంటుందని నాగ్ చెప్పాడు. సినిమాలో విజయ్ కుమార్ పాత్ర ఫియర్ లెస్‌గా ఎన్ఐఏ ఆపరేషన్లు చేస్తుందని.. ఆ సంగతి పక్కన పెడితే తాను సినిమా కెరీర్ విషయంలోనూ ఎప్పుడూ ఫియర్ లెస్‌గానే ఉంటానని నాగ్ చెప్పాడు. సినిమాల ఫలితాల గురించి ఆలోచించకుండా కెరీర్ ఆరంభం నుంచి ఎప్పుడూ ప్రయోగాలు చేస్తూనే వచ్చానని.. ఒకే తరహా పాత్రలు చేయడం.. ఒకేలా నటించడం తనకు నచ్చదని.. అందుకే కెరీర్లో ఎప్పటికప్పుడు కొత్త పాత్రలు చేస్తూ, ప్రయోగాలు చేస్తూ సాగిపోయానని నాగ్ తెలిపాడు. ఈ మాటలు చూస్తుంటే.. అందరిలా రొటీన్ కమర్షియల్ సినిమాలు చేస్తే తన రేంజ్ వేరుగా ఉండేదని, ఎప్పటికప్పుడు ప్రయోగాలు చేయడం వల్లే ఫెయిల్యూర్లు తప్పలేదని నాగ్ చెబుతున్నట్లుగా అనిపించింది. ఏదేమైనా సరే.. నాగ్ ఉన్నట్లుండి ఇంత సీరియస్‌గా, కొంచెం ఎమోషనల్‌గా మాట్లాడటం మాత్రం అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఆయనలో ఒకప్పటి ఉత్సాహం, కాన్ఫిడెన్స్ ఏమయ్యాయనే ప్రశ్నలు తలెత్తాయి.