Begin typing your search above and press return to search.
వర్మ.. యండమూరిలపై నాగబాబు మళ్లీ..
By: Tupaki Desk | 30 Jan 2017 4:48 AM GMTఖైదీ నెంబర్ 150 ప్రి రిలీజ్ ఈవెంట్లో నాగబాబు.. రామ్ గోపాల్ వర్మ.. యండమూరి వీరేంద్రనాథ్ లపై చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో తెలిసిందే. నాగబాబు వ్యాఖ్యలపై వర్మ.. యండమూరి కూడా ఘాటుగానే స్పందించారు. అప్పుడు తిరిగి నాగబాబు ఏమీ స్పందించని నాగబాబు.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆ గొడవపై వివరంగా స్పందించాడు. అతనేమన్నాడంటే..
‘‘యండమూరి చరణ్ గురించి మాట్లాడుతూ వాడు వీడు అన్నాడు. ఆయన చరణ్ మీద ఆప్యాయతతో ఆ మాటలు వాడి ఉంటే నాకు అభ్యంతరం లేదు. కానీ అతణ్ని కించపరిచే క్రమంలో ఆ పదాలు వాడాడు. నాకు యండమూరితో శత్రుత్వం ఏమీ లేదు. ఇప్పటికీ ఆయన్ని గురువు గారు అని సంబోధిస్తా. ఎంతో గౌరవిస్తా. వ్యక్తిగతంగా మా ఇద్దరి మధ్య మంచి సంబంధాలున్నాయి. నా గురించి ఆయనకు తెలుసు కాబట్టి నా కామెంట్లను సీరియస్ గా తీసుకుని ఉండరనుకుంటున్నా’’ అని నాగబాబు అన్నాడు.
ఇక వర్మపై చేసిన కామెంట్ల గురించి స్పందిస్తూ.. ‘‘అన్నయ్యను.. మా కుటుంబ సభ్యుల్ని ఎవరైనా టార్గెట్ చేస్తే నేను మెంటల్ బ్యాలెన్స్ కోల్పోతా. ఈ విషయంలో నన్నెవరైనా విమర్శించినా పట్టించుకోను. నా మాటలు వర్మను బాధించినట్లున్నాయి. అందుకే అలా స్పందించాడు. నేను చిరంజీవిలో 0.01 పర్సంట్ కూడా ఉండనని వర్మ అన్నాడు. అతననడం ఏంటి.. నేనే చెబుతున్నా. అన్నయ్యతో పోలిస్తే నేను జీరో పర్సంటే. ఆయన మీద ఆధారపడుతున్నందుకు నేను సంతోషంగానే ఉన్నా. పీఆర్పీ పార్టీ వైఫల్యానికి నేనే కారణమని వర్మ అన్న మాటతో నేను ఏకీభవిస్తా. ఎందుకంటే అన్నయ్యకు పార్టీ పెట్టమని సలహా ఇచ్చిన వాళ్లలో నేనూ ఒకడిని.
ఒక దశలో నాకు వర్మ చిన్న పిల్లాడిలా కనిపించాడు. నా సలహాలేమీ తీసుకోవద్దని వరుణ్ తేజ్ కు సలహా ఇచ్చాడు. నిజానికి నా కొడుక్కి నేనేమీ సలహాలివ్వను. ఏదైనా విషయం నాతో చర్చిస్తే నా అభిప్రాయం చెబుతానంతే. వర్మ తమాషా మనిషి. అతడి కంపెనీ నాకు నచ్చుతుంది. కానీ గత ఐదేళ్లుగా అతను మా మెగా ఫ్యామిలీపై రాళ్లేస్తూనే ఉన్నాడు. అందుకే అలా స్పందించాను. అతను గౌతమీపుత్ర శాతకర్ణిని పొగిడాడు. నాకు అభ్యంతరమేమీ లేదు. కానీ ఖైదీ నెంబర్ 150ని ఎలా టార్గెట్ చేస్తాడు. రీమేక్ అని విమర్శించడం.. దీని పోస్టర్ని అవతార్ సినిమాతో పోల్చడం ఏంటి? అతను ట్విట్టర్ని ఆయుధంగా వాడుకున్నాడు. నేను లెక్కలు సరి చేయడానికి ఓ పెద్ద ఈవెంట్లో మైకునే వాడుకున్నా. అతడితో నాకు వ్యక్తిగత విభేదాలేమీ లేవు. వర్మ.. యండమూరిలపై తాను ఉపయోగించిన భాష విషయంలో అన్నయ్యకు అభ్యంతరాలున్నప్పటికీ నా ఫీలింగ్స్ విషయంలో ఆయనకు కూడా అభ్యంతరాలేం లేవు. ఆయనైతే ఇలాంటివి పట్టించుకోవద్దని అంటారు’’ అని నాగబాబు అన్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/