Begin typing your search above and press return to search.
మెగా బ్రదర్ కు డ్రెస్సుల గోలెందుకు
By: Tupaki Desk | 4 Feb 2019 5:09 AM GMTఎందుకో తెలియదు కాని వీడియోల రూపంలో ఏదో ఒకటి మాట్లాడి ప్రచారంలో ఉందామనుకుంటున్న మెగా బ్రదర్ నాగబాబు ఉద్దేశం ఏదో పక్కదారి పడుతున్నట్టు అనిపిస్తోంది. మొన్నటిదాకా రాజకీయాలు మాత్రమే నేపధ్యంగా తీసుకుని బాలకృష్ణ-లోకేష్-చంద్రబాబు నాయుడు ఇలా టార్గెట్ పెట్టుకుని మరీ మాట్లాడిన నాగబాబు సడన్ గా రూటు మార్చేసారు. ఆడవాళ్ళ డ్రెస్సింగ్ గురించి వాళ్ళ తరఫున వకాల్తా పుచ్చేసుకున్నారు. నా ఛానల్ నా ఇష్టం పేరుతో ఇటీవలే యుట్యూబ్ లో ఎకౌంటు ఓపెన్ చేసిన నాగబాబు తాజాగా సాంప్రదాయ వాదుల మీద విరుచుకుపడ్డారు.
ప్రవచనాలు చెప్పే ఓ జ్ఞానీ టాలీవుడ్ లో గొప్ప పేరున్న సంగీత దర్శకుడు ఈ ఇద్దరు అమ్మాయిలు చక్కని దుస్తులు వేసుకుంటే సమాజంలో అఘాయిత్యాలు తగ్గుతాయని ఎక్స్ పోజ్ చేయడం మానాలని చెప్పడం తాను చూశానని అయితే వాళ్ళకు అలా చెప్పే అధికారం ఎవరిచ్చారు అని నాగబాబు తీవ్ర స్వరంతో విరుచుకుపడ్డారు. అఫ్ కోర్స్ మరి ఇది ప్రశ్నించడానికి మీరెవరు అంటూ కామెంట్స్ లో అడిగిన ఉన్నారు లెండి. అయితే నాగబాబు అక్కడితో ఆగిపోలేదు. మగాళ్ళకు లేని ఆంక్షలు ఆడాళ్ళకు ఎందుకంటూ చీర కట్టుకుంటారో లేక అందరిని ఆకర్షించడానికి ఎక్స్ పోజ్ చేస్తారో అది వాళ్ళ స్వేచ్చ అని ఒళ్లంతా కప్పుకున్న మహిళల మీద మానభంగాలు జరగలేదా అంటూ కొత్త లాజిక్ లేవనెత్తారు.
మగాళ్ళను ఎవరైనా జీన్స్ వేసుకోవద్దు పంచెలు కట్టుకోండి లేదా జబ్బలు కనిపించేలా బనియన్లు వేసుకోకండి అక్కడ జుత్తు మాకు కనిపిస్తుంది అంటూ ఎవరైనా అడిగారా అంటూ మెల్లగా వితండ వాదంలోకి దిగిపోయారు. నాగబాబు చెప్పిన కొన్ని పాయింట్లు సబబుగానే ఉన్నప్పటికీ మరీ ఇంత లాజిక్ లేకుండా టాపిక్ ని ఎక్కడికో తీసుకెళ్ళడం ఉద్దేశాన్ని దెబ్బ తీసింది. ఈ లెక్కన దేవుడు ప్రత్యక్షమైతే మగాళ్ళకు మాత్రమే గెడ్డాలు మీసాలు ఎందుకు ఇచ్చారు ఆడవాళ్లంటే అంత చులకనా అంటూ నిలదీసేలా ఉన్నారు. ఇన్నాళ్ళు ఏ వివాదం లేకుండా ప్రశాంతంగా ఉన్న నాగబాబు లేనిపోని రచ్చతో అనవసరమైన చిక్కులు తెచ్చుకుంటున్న మాట వాస్తవం