Begin typing your search above and press return to search.

రివ్యూస్ పై మెగా బ్రదర్ కౌంటర్

By:  Tupaki Desk   |   2 May 2018 12:27 PM GMT
రివ్యూస్ పై మెగా బ్రదర్ కౌంటర్
X
నాగబాబు మంచి హుషారు మీదున్నాడు. అందులో ఈ ఏడాది తనకు మరీ స్పెషల్ గా మిగలనుంది. తన వారసుడు వరుణ్ తేజ్ కు ఫిదా తర్వాత మరో సూపర్ హిట్ తొలిప్రేమ ఫిబ్రవరిలో రాగా మార్చ్ చివరిలో వచ్చిన అన్నయ్య కొడుకు రామ్ చరణ్ రంగస్థలం రికార్డుల దుమ్ము దులిపింది. ఇక తాను చాలా కాలం తర్వాత నిర్మాతగా మారి తీసిన నా పేరు సూర్య స్వయానా బావమరిది కొడుకుది కావడం దీని మీద ప్రీ పాజిటివ్ టాక్ బలంగా ఉండటం ఇలా అన్ని రకాలుగా ఫుల్ హ్యాపీగా ఉన్నాడు నాగబాబు. ఇక నా పేరు సూర్య ప్రమోషన్ కోసం వరసబెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్న మెగా బ్రదర్ తాజాగా ఒకదాంట్లో కొందరు క్రిటిక్స్ రాస్తున్న రివ్యూస్ మీద గట్టి కౌంటర్ వేసాడు. అల్లు అరవింద్ స్టేజి మీద నా పేరు సూర్యకు నెగటివ్ ప్రచారం జరిగే అనుమానం వ్యక్తం చేయడం గురించి యాంకర్ అడిగిన ప్రశ్నకు నాగబాబు దీనికి లింక్ చేస్తూ స్పందించాడు.

ప్రేక్షకులు సినిమాలు రివ్యూస్ చదివి రారని తమకు చూడాలని అనిపిస్తే బాగుందని తెలిస్తే ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఆడుతుందని చెప్పేసారు. గతంలో కొందరు క్రిటిక్స్ బాగా లేవని విమర్శించిన సినిమాలు ఇండస్ట్రీ హిట్ కావడం లాంటివి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయని చెప్పాడు. ఎవరి దాకో ఎందుకు రంగస్థలం విషయంలోనే కొందరు క్రిటిక్స్ సినిమా చాలా పాత స్టైల్ లో ఉందని అంతగా ఆకట్టుకోలేదని రివ్యూ పెట్టారని కాని నాన్ బాహుబలి రికార్డ్స్ అన్ని సొంతం చేసుకున్న రంగస్థలం కన్నా ఉత్తమ ఉదాహరణ ఇంకేం కావాలని చెప్పుకొచ్చాడు. ఇక్కడ ఎవరిని టార్గెట్ చేయని నాగబాబు విమర్శలు చేయటమే పనిగా పెట్టుకున్న వాళ్ళకు మాత్రం నేరుగా బాణం విసిరాడు. అలాగే సినిమా బాగుందని రాసినవాళ్ళు యావరేజ్ గా ఉందని చెప్పిన వాళ్ళు అందరిది వ్యక్తిగత అభిప్రాయమే తప్ప దాన్ని జెనరలైజ్ చేయలేమని క్లారిటీ ఇచ్చాడు. నా పేరు సూర్య ఒక రకమైన ఎక్స్ పరిమెంట్ కమర్షియల్ మూవీ కనక టాక్ గురించి కొంత అప్రమత్తం చేసినట్టు అనుకోవచ్చు. ఎల్లుండి విడుదల కానున్న నా పేరు సూర్య మీద ఇప్పటికే చాలా అంచనాలు ఉన్నాయి. ఉదయం 5 గంటల నుంచే షోలు ప్రారంభం కానున్న నేపధ్యంలో టాక్ త్వరగానే బయటికి వచ్చే అవకాశం ఉంది.

వీడియో కోసం క్లిక్ చేయండి