Begin typing your search above and press return to search.

తారక్ కి తండ్రిగా మెగా సీనియర్

By:  Tupaki Desk   |   23 Jun 2018 5:43 AM GMT
తారక్ కి తండ్రిగా మెగా సీనియర్
X
ఈ మధ్య కాలంలో సినిమా తారల మధ్య సాన్నిహిత్యం చాలా పెరిగిపోతోంది. గతంలో కూడా చాలా ఉండేది. కాకపోతే పెద్దగా బయటకు ఆ విషయాలు తెలిసేవి కావు. గతంలో ఎప్పుడు లేని విధంగా వారసులు ఎక్కువగా స్నేహాల్ని పెంచేసుకుంటున్నారు. నందమూరి స్టార్ హీరో తారక్ అయితే మెగా ఫ్యామిలీతో ఎంత క్లోజ్ గా ఉంటున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఎంతో కాలం నుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో స్నేహాన్ని కొనసాగిస్తున్నాడు.

ఇక కాలం కూడా తారక్ ని మెగా ఫ్యామిలీకి చాలా దగ్గరగా చేస్తోంది. రామ్ చరణ్ తో కలిసి మల్టీస్టారర్ చేస్తున్నాడు. అలాగే త్రివిక్రమ్ సినిమా వల్ల కొంచెం ఎక్కువగా సాన్నిహిత్యం పెరుగుతోంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా లాంచ్ కార్యక్రమానికి పవన్ స్పెషల్ గెస్ట్ గా వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు అదే సినిమాలో మెగా బ్రదర్ నాగబాబుతో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ఆ పాత్ర ద్వారా ఇద్దరికి మంచి సాన్నిహిత్యం ఏర్పడుతుందని చెప్పవచ్చు.

ఎందుకంటే నాగబాబు తారక్ కి తండ్రిగా నటించనున్నారట. త్రివిక్రమ్ తండ్రి పాత్రలకు ఏ తరహాలో ఇంపార్టెన్స్ ఇస్తారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. తప్పకుండా ఎమోషన్ అండ్ కామెడీ ఉంటుందని చెప్పవచ్చు. డైలాగ్స్ కూడా క్లిక్ అవుతాయని చెప్పవచ్చు. ఆ విధంగా ఎన్టీఆర్ నాగబాబు రిలేషన్ సినిమాలో హైలెట్ అవుతుందని టాక్. ఇక ప్రస్తుతం అరవింద సమేత షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది.