Begin typing your search above and press return to search.

టాలీవుడ్ మొత్తం సీఎం జ‌గ‌న్ కి అండ‌గా ఉండాలి! నాగ‌బాబు

By:  Tupaki Desk   |   1 March 2022 12:30 PM GMT
టాలీవుడ్ మొత్తం సీఎం జ‌గ‌న్ కి అండ‌గా ఉండాలి! నాగ‌బాబు
X
మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ఏ విష‌యంపైనైనా ముక్కు సూటిగా మాట్లాడుతారు. మెగా ఫ్యామిలీని ఎవ‌రైనా టార్గెట్ చేస్తే ముందు రియాక్ట్ అయ్యేది నాగ‌బాబునే. త‌న‌దైన శైలిలో కౌంట‌ర్లు వేయ‌డం..మాట‌కు మాట స‌మాధానం చెప్ప‌డం నాగ‌బాబు ప్ర‌త్యేక‌త‌. ఇక ఏపీలో సినిమా రిలీజ్ ప‌రిస్థితి ఎలా ఉంద‌న్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. త‌గ్గిన టిక్కెట్ ధ‌ర‌ల‌తో సినిమాలు ప్ర‌ద‌ర్శించ‌డం ఇండ‌స్ర్టీకి మింగుడు ప‌డ‌ని అంశంగా మారింది. ఇంకా పాత టిక్కెట్ ధ‌ర‌లే అమలు లో ఉన్నాయి. కొత్త జీవో ఇంకా రిలీజ్ చేయ‌లేదు. జ‌గ‌న్ స‌ర్కార్ రేపో మాపో అన్న తీరుగా వ్య‌వ‌హ‌రిస్తోంది త‌ప్ప‌..ఎప్పుడు ఉత్త‌ర్వులు ఇస్తారో? లేదో? కూడా క్లారిటీ లేదు.

ఈ అంశంపై ప‌రిశ్ర‌మ అంతా సానుకూలంగానే ఉంది. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన `భీమ్లానాయ‌క్` రిలీజ్ కి ముందే జ‌గ‌న్ స‌ర్కార్ గుడ్ న్యూస్ చెబుతుంద‌ని అంతా భావించారు. కానీ సీన్ రివ‌ర్స్ అయింది. అయితే అప్ప‌ట్లో ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌కు ఇండ‌స్ర్టీ మ‌ద్ద‌తివ్వ‌లేదు. అవి కేవ‌లం ఆయ‌న వ్య‌క్తిగ‌త వ్యాఖ్యలుగానే భావించాల‌ని ప్ర‌భుత్వాన్ని ఉద్దేశించి కొంత మంది పెద్ద‌లు స్పందించారు. ఈ నేప‌థ్యంలో తాజా ప‌రిస్థితుల్న బేరీజు వేసుకుని నాగ‌బాబు ఇండ‌స్ర్టీని -సినిమా రిలీజ్ ల్ని ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు.

``తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ అంతా జ‌గ‌న్ కి అండ‌గా నిల‌వాలి అని కోరుకుంటున్నా. అవ‌స‌ర‌మైతే జ‌గ‌న్ సీఎంగా ఉన్నంత కాలం టాలీవుడ్ లో ఏ సినిమా విడుద‌ల చేయ‌కూడ‌దు. సినిమా ఇండ‌స్ర్టీని ఎలాగైనా అణిచివేయాల‌ని చూస్తున్నారు. కాబ‌ట్టి మీ సినిమాల ప్ర‌ద‌ర్శ‌న కోసం ఓటీటీకి వెళ్లిపోండి. అమెజాన్ ప్రైమ్..నెట్ ప్లిక్స్ ని ఉప‌యోగించండి. ఏపీలో మాత్రం చిత్రాల్ని ప్ర‌ద‌ర్శించ‌డానికి జియో టెలికాస్ట్ టెక్నాల‌జీ ఉప‌యోగించండి. తెలంగాణ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయండి. ఇక్క‌డి రాష్ర్ట ప్ర‌భుత్వం అన్ని ర‌కాలుగా స‌హ‌కారం అందిస్తుంద‌ని`` అన్నారు.

ఇంకా ఏమ‌న్నారంటే?.. ``ఓటీటీ రిలీజ్ సినిమాలు చేయ‌డం చాలా సుల‌భం అవుతుంది. హీరోల‌ని 150 వ‌ర్కింగ్ డేస్ అడిగే బ‌ధులు 60 రోజులు అడ‌గండి. త‌ద్వారా సినిమా త్వ‌రగా పూర్త‌వుతుంది. నిర్మాణ వ్య‌యాలు త‌గ్గుతాయి. స్టార్ హీరోలు ఒక సినిమాకి బ‌ధులుగా 3 ఓటీటీ సినిమాలు చేయోచ్చు. ఆ రూపంలోనూ హీరోలు బాగానే సంపాదించ వ‌చ్చు ``అని అన్నారు.

మ‌రి నాగ‌బాబు ఇచ్చిన స‌ల‌హాలు ప్రాక్టిక‌ల్ గా వ‌ర్కౌట్ అవుతాయా? ఓటీటీ ఛాయిస్ అనేది అంత సుల‌భం కాదు. ఏపీలో జియో టెక్నాల‌జీతో టెలికాస్ట్ చేసి..తెలంగాణ లో థియేట‌ర్లో ఒకేసారి రిలీజ్ చేయ‌డం అన్న‌ది సాధ్య‌మ‌య్యేది కాదు.

అలా జ‌రిగితే సినిమా పైర‌సీ జ‌రుగుతుంది. అలాగే ఈ విష‌యంలో రెండు రాష్ర్టాల పంపిణీ దారుల్ని ఒప్పించ‌డం క‌ష్ట‌మైన ప‌ని. అప్పుడు పంపిణీదారుడు రిస్క్ తీసుకుని సినిమాని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఏపీలో థియేట్రిక‌ల్ ఆదాయం పూర్తిగా కోల్పోయిన‌ట్లే. నాగ‌బాబు సూచ‌న‌లు పాటిస్తే మొత్తం థియేట‌ర్ రిట‌ర్న్ మోడ‌ల్..రెవెన్యూ వ్య‌వ‌స్థ‌నే త‌ల్ల‌కిందులు అయిపోతుంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.