Begin typing your search above and press return to search.
సాహసం చేసి నష్టపోయాం : నాగబాబు
By: Tupaki Desk | 5 March 2019 6:02 AM GMTమెగా బ్రదర్ నాగబాబు నటుడిగా, నిర్మాతగా ఇండస్ట్రీలో అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. కాని రెండు రకాలుగా కూడా ఆయనకు వర్కౌట్ అవ్వలేదు. నిర్మాతగా మొదటి సినిమానే భారీ నష్టాలను మిగిల్చింది. నిర్మాతగా నాగబాబు మొదటి సినిమా 'రుద్రవీణ'. ఆ సినిమా విశేషాలను తాజాగా ఒక ఇంటర్వ్యూలో నాగబాబు షేర్ చేసుకున్నాడు. ఆ సినిమా ఆర్థికంగా నిరాశ పర్చినా కూడా జాతీయ అవార్డులను తెచ్చి పెట్టిందంటూ నాగబాబు చెప్పుకొచ్చాడు.
ఎల్ ఎల్ బి పూర్తి చేసిన నేను ఎంబీఏ చేసేందుకు సిద్దం అవుతున్న సమయంలో అన్నయ్య పిలిచి ఇండస్ట్రీలో నాకు తోడుగా ఉండమంటూ పిలిచారు. ఆ సమయంలో నాకు కూడా ఆసక్తి ఉండటంతో ఇండస్ట్రీలో అడుగు పెట్టాను. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ ను స్థాపించి సినిమాను నిర్మించేందుకు సిద్దం అయ్యాం. బ్యానర్ లో మొదటి సినిమా చాలా భిన్నంగా, ప్రతిష్టాత్మకంగా పేరు ప్రతిష్టలు తెచ్చే విధంగా ఉండాలని భావించాను. అందుకోసమే శంకరాభరణం టైప్ లో సినిమాను చేయాలని భావించి బాలచందర్ గారి దర్శకత్వంలో రుద్రవీణను మొదలు పెట్టాం.
1986లో 'రుద్రవీణ' మొదలు పెట్టాం. కొన్ని కారణాల వల్ల సినిమా పూర్తి అవ్వడానికి సంవత్సరంన్నర సమయం పట్టింది. అప్పట్లోనే దాదాపు 90 లక్షల బడ్జెట్ తో నిర్మించాం. అప్పుడు 90 లక్షల బడ్జెట్ అంటే అత్యంత భారీ బడ్జెట్ అన్నట్లు. అంత బడ్జెట్ తో మూవీ నిర్మిస్తే చాలా మంది మక్కున వేలేసుకున్నారు. ఇళయరాజా గారు ఒక్క రోజులోనే ట్యూన్స్ అన్నీ ఇచ్చేశారు. సిరివెన్నెల గారు అన్ని పాటలు రాశారు.
సినిమా రిలీజ్ అయితే సక్సెస్ అవ్వొచ్చు లేదంటే దెబ్బ పడొచ్చు అని మేము కూడా భావించాం. ఉడుకు రక్తంతో ఉన్నాం కనుక ఆ సమయంలో మేము ఆ సాహసంను చేశాం. సినిమా మొత్తం పూర్తి అయ్యి విడుదలైన తర్వాత సినిమా ఫ్లాప్ అయ్యింది. 15 లక్షల వరకు సినిమాకు నష్టం వచ్చింది. సినిమా నష్టపర్చడంతో బాధపడ్డాం. అయితే జాతీయ స్థాయిలో మూడు అవార్డులను సినిమా దక్కించుకోవడంతో చాలా సంతోషించాం.
సినిమాకు నిర్మాతగా నేను వ్యవహరించినా కూడా అన్నయ్య మొత్తం డబ్బులు పెట్టారు. అందుకే జాతీయ అవార్డును అన్నయ్యను తీసుకోమన్నాను. అందుకు అన్నయ్య ఒప్పుకోలేదు. నేను బలవంతం పెట్టడంతో సరే అన్నాడు. అప్పుడు ఏం జరిగితే అది జరుగుతుంది అంటూ 'రుద్రవీణ' వంటి ప్రయోగాత్మక చిత్రం నిర్మించాం. కాని ఇప్పుడు అలాంటి సినిమాను, అంత భారీ కాస్టింగ్ తో సినిమా చేయడంకు సాహసం చేయలేమని నాగబాబు చెప్పుకొచ్చాడు.