Begin typing your search above and press return to search.
పవన్ ఎవరిని వదిలిపెట్టడు: నాగబాబు
By: Tupaki Desk | 22 April 2018 4:21 PM GMTనా పేరు సూర్య ఆడియో రిలీజ్ వేదికగా మరోసారి నాగబాబు పవన్ మీద ప్రేమను అల్లు అర్జున్ గురించి ఎవరికి తెలియని విషయాలను షేర్ చేసుకుని మరోసారి మెగా ఫాన్స్ దృష్టిని ఆకర్షించారు. మూడు రోజుల క్రితం ప్రెస్ మీట్ చేసినప్పటి నుంచి గొంతు నొప్పితో బాధపడుతున్న నాగబాబు ప్రీ రిలీజ్ రోజు ఎక్కువ మాట్లాడతాను అని చెప్పి కాసేపు అల్లు అర్జున్ బాల్యం గురించి అతని మనస్తత్వం గురించి కొన్ని జ్ఞాపకాలు పంచుకున్న తర్వాత పవన్ టాపిక్ తీసుకొచ్చాడు. మొదట్లోనే అభిమానులు పవన్ గురించి డిమాండ్ చేస్తే అది చెప్పకుండా స్టేజి దిగను అని చెప్పి కూల్ చేసారు. తొలుత మెగాస్టార్ చిరంజీవి ప్రస్తావన తీసుకువచ్చిన నాగబాబు తమకు అందరికి లైఫ్ ఇచ్చిన ఆయనకు థాంక్స్ అని చెప్పి అసలు టాపిక్ మొదలుపెట్టాడు.
తమ్ముడు పవన్ కళ్యాణ్ పెద్ద హీరో అని సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ పొజిషన్ లో ఉండి కోట్ల రూపాయలు త్యాగం చేసిన అతని మీద ఎన్నో నీచమైన రాజకీయాలు చేస్తున్నారని నాగబాబు ఫైర్ అయ్యాడు. కళ్యాణ్ బాబు లాంటి వాడు రాకూడదని వస్తే వాళ్ళ వేషాలు సాగవని రకరరకాల కుట్రలు చేసి ఆఖరికి కుటుంబాలను తిట్టే నీచానికి దిగాజారారని చెప్పిన నాగబాబు పవన్ కళ్యాణ్ ఒక్కడు కాదని వెనుక ఎంతో మంది పవన్ కళ్యాణ్ లు ఉన్నారని చెప్పి అబిమానుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేసాడు. ఎవరైతే రాకూడదు అని కోరుకున్న వ్యక్తులు పార్టీలు ఉన్నాయో వాళ్ళందరి దుమ్ము దులిపేలాగా రాబోతున్నాడు అని నాగబాబు అన్నప్పుడు సభలో గోల మామూలుగా లేదు. దేవుడు మీ రూపంలో చాలా ఇచ్చాడని డబ్బు సంపాదించడం కోసం రాలేదని స్కాములు చేయాల్సిన అవసరం లేదని చెప్పడం విశేషం.
చివర్లో ఒక్కొక్కడికి ఉంటదని చెప్పిన నాగబాబు గతంలో దెబ్బ తిన్నాం ఈ సారి వదిలే సమస్యే లేదు అంటూ ముగిసిపోయిన ప్రజారాజ్యం ప్రస్తావన కూడా తీసుకువచ్చాడు. మొత్తానికి నాగబాబు తన ఆవేశాన్ని మరీ ఎక్కువగా కాకుండా మితంగా కావలసిన మోతాదులో తానూ ఒక నిర్మాతే అయినా సినిమా గురించి కాసేపే మాట్లాడి పవన్ గురించి ఎక్కువ సమయం కేటాయించడం గమనార్హం.