Begin typing your search above and press return to search.
రామ్ చరణ్ ను.. రాముడితో పోల్చిన నాగబాబు..ఆ స్థాయి నీదే అంటూ పోస్ట్!
By: Tupaki Desk | 27 March 2021 8:03 AM GMTఇవాళ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 36వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ హ్యాపీ అకేషన్ లో శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. ఆ గ్రీటింగ్స్ జడిలో తడిసిముద్దవుతున్నాడు చెర్రీ. నిజానికి ఈ వేడుకలు నిన్నటి నుంచే మొదలయ్యాయి. శుక్రవారం హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో చెర్రీ బర్త్ డే సెలబ్రేషన్స్ అట్టహాసంగా నిర్వహించారు.
ఈ వేడుకకు హాజరైన సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్.. తమదైన స్పీచ్ తో అభిమానుల్లో ఫుల్ జోష్ నింపారు. మెగాస్టార్ తర్వాత ఆ రేంజ్ పుట్టిన రోజు వేడుకలు.. మా బావ రామ్ చరణ్ వేనని అన్నారు. అభిమానుల ప్రేమ వల్లే ఇది సాధ్యమైందని అన్నారు.
కాగా.. మెగా బ్రదర్ నాగబాబు కూడా రామ్ చరణ్ కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు నాగబాబు చేసిన ట్వీట్ తో మెగా అభిమానులు మరింత హ్యాపీగా ఫీలవుతున్నారు. రామ్ చరణ్ ను రాముడితో పోల్చారు మెగా బ్రదర్. ‘‘రాముడు దేవుడు మాత్రమే కాదు.. అన్నదమ్ముల ప్రేమకు ప్రతిరూపం. మా జనరేషన్ లో అన్నయ్య చిరంజీవి రాముడిలా ఉన్నారు. ఈ జనరేషన్ లో అన్నదమ్ములకు అండగా ఉంటూ నువ్వు రాముడివయ్యావు.’’ అంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు నాగబాబు.
ఇదిలాఉండగా.. రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్ గా నిన్న RRRలోని అల్లూరి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది యూనిట్. ఇవాళ సిద్ధ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది ఆచార్య టీమ్. ఈ రెండు పోస్టర్లలోని రామ్ చరణ్ రూపం ఆకట్టుకోవడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.