Begin typing your search above and press return to search.
అమీర్ ఖాన్ నుంచి 45రోజుల్లోనే నేర్చుకున్నా: నాగచైతన్య
By: Tupaki Desk | 30 May 2022 2:30 PM GMTఅక్కినేని నాగచైతన్య ప్రస్తుతం థాంక్యూ సినిమాతో సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. అయితే బాలీవుడ్లో కూడా నాగచైతన్య మొదటి సారి నటించిన లాల్ సింగ్ చద్దా చిత్రం కూడా త్వరలోనే విడుదల కాబోతోంది. అమీర్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమాలో నాగచైతన్య ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేయాలని అనుకుంటున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కూడా చిత్ర యూనిట్ సభ్యులు మొదలుపెట్టారు.
రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది. హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో కరీనాకపూర్ హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నాగచైతన్య అమీర్ ఖాన్ గురించి ఒక్క.మాట మాత్రం కచ్చితంగా చెప్పగలను అని తనదైన శైలిలో వివరణ ఇచ్చారు.
ఆయనతో ఎన్నో నేర్చుకున్నాను. గత 12 సంవత్సరాల్లో నేను సినిమా ఇండస్ట్రీ లో ఉంటున్నాను అయితే ఈ ఇంతకాలం నేర్చుకున్న దానికంటే ఎక్కువగా అమీర్ ఖాన్ దగ్గర కేవలం 45 రోజుల్లోనే నేర్చుకున్నాను. ఒక విధంగా చెప్పాలంటే అంతకు మించి ఆయన నుంచి చాలా నేర్చుకోవాలి అనిపించింది. అమీర్ ఖాన్ కేవలం ఒక నటుడు మాత్రమే కాదు మంచి వ్యక్తిత్వం గల మనిషి. ముఖ్యంగా ఒక నటుడు జీవితం ఎలా ఉండాలి అనే విషయం లో కూడా చాలా నిబద్ధత కలిగిన వారు.
ఒక సినిమాలో ఆయన చూసేది కేవలం కంటెంట్ మాత్రమే. ఇక ఆ సినిమా బాక్సాఫీసు వద్ద ఎంత కలెక్ట్ చేసింది అనే విషయాలను గురించి కూడా పెద్దగా ఆలోచించరు.అమీర్ ఖాన్ దగ్గర అది నాకు చాలా బాగా నచ్చింది. అలాగే ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు అంటే ఆ పాత్రలో నటించడానికి ఎంతగానో కట్టుబడి ఉంటాడు.. ఇక ఇతర విషయాలపై కూడా అమీర్ ఖాన్ కు చాలా పట్టు ఉంది. అందుకే ఆయన నేటితరం నటీనటులకు ఎంతగానో స్పూర్తిదాయకంగా నిలుస్తున్నారు అని నాగచైతన్య వివరణ ఇచ్చాడు.