Begin typing your search above and press return to search.

అఖిల్ లో నాకు నచ్చేది అదే .. తన దగ్గర మాస్టర్ ప్లాన్ ఉంది: చైతూ

By:  Tupaki Desk   |   9 Oct 2021 3:30 AM GMT
అఖిల్ లో నాకు నచ్చేది అదే .. తన దగ్గర మాస్టర్ ప్లాన్ ఉంది: చైతూ
X
అఖిల్ హీరోగా 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకుడిగా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' రూపొందింది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ బన్నీ వాసు - వాసు వర్మ నిర్మించిన ఈ సినిమాలో, అఖిల్ సరసన నాయికగా పూజ హెగ్డే నటించింది. విజయదశమి కానుకగా ఈ నెల 15వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిన్న రాత్రి హైదరాబాద్ .. ఫిల్మ్ నగర్ లోని 'జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్' లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన నాగ చైతన్య మాట్లాడాడు.

"అక్కినేని అభిమానులంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? రోజులు మారుతున్నాయి .. పరిస్థితులు మారుతున్నాయి. కానీ మీ ఎనర్జీ మాత్రం అస్సలు మారదు. మీ అందరినీ ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. వాసు వర్మ .. బన్నీ వాసు .. అల్లు అరవింద్ .. నా కెరియర్ లో ఈ ముగ్గురి పాత్ర ప్రత్యేకం. వాసు వర్మ నా ఫస్టు మూవీ 'జోష్'ను డైరెక్ట్ చేశాడు .. నేను ఆ సినిమా నుంచి ఎంతో నేర్చుకున్నాను. బన్నీ వాసుతో '100% లవ్' సినిమాను చేశాను. ఆ సినిమా నాకు ఒక డైరెక్షన్ ఇచ్చింది.

బన్నీ వాసు గురించి నాకు బాగా తెలుసు ... తను కథను మాత్రమే నమ్ముతాడు. స్క్రిప్ట్ ఓకే అయిన తరువాతనే మిగతా ప్రాసెస్ మొదలుపెడతాడు. ఇక అరవింద్ గారి విషయానికి వస్తే, ఆయన ఒక కథను ఓకే చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుందని చాలామంది డైరెక్టర్లు చెప్పారు. ఆ ప్రాసెస్ అలాగే ఉండాలి .. ఇక సక్సెస్ ఫుల్ సినిమా తీయాలంటే ఆ మాత్రం కేర్ ఉండాలి .. అంత ప్యాషన్ ఉండాలి .. అంత డెడికేషన్ ఉండాలి. అరవింద్ గారికి పెద్ద ఓటీటీ ఉన్నప్పటికీ ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయాలని డిసైడ్ కావడం విశేషం.

ఇలాంటి సమయంలో సినిమా అనేది థియేటర్స్ కి రావడం చాలా ఇంపార్టెంట్. అరవింద్ గారు ఒక సినిమా రిలీజ్ కి డేట్ సెట్ చేశారంటే ఆయనకి 100 పెర్సెంట్ సంతృప్తి కలిగిన తరువాతనే ఆ నిర్ణయం తీసుకుంటారు. ఇక భాస్కర్ విషయానికి వస్తే, హ్యూమన్ ఎమోషన్స్ ను ఆయన చాలా బాగా హ్యాండిల్ చేస్తాడు. ఇక అఖిల్ విషయానికి వస్తే, ఒక సినిమా రిజల్ట్ కంటే దానికి ప్రిపేరయ్యే ప్రాసెస్ ని ఎక్కువగా ప్రేమిస్తాడు. అఖిల్ లో నాకు బాగా నచ్చేది అదే.

రానున్న ఐదారేళ్లలో ఎలాంటి కథలు చేయాలి .. ఎలాంటి పాత్రలు చేయాలనేది ఆయన మైండులో ఒక మాస్టర్ ప్లాన్ ఉంది. తాను ఎలాగైనా అనుకున్నది చేసే తీరతాడు. ఆయనలో ఆ డెడికేషన్ ఉంది. ఆయన కెరియర్ ను స్టార్ట్ చేసి ఐదేళ్లు అయిందనుకుంటాను. ప్రతి ఏడాది నేను ఒక కొత్త అఖిల్ ను చూస్తుంటాను. తన ఫిజిక్ ను .. బాడీ లాంగ్వేజ్ ను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటాడు. ట్రైలర్ చూస్తే ఒక సెలబ్రేషన్ లా అనిపించింది. ఇలాంటి ఒక పరిస్థితుల్లో ఆడియన్స్ కి ఒక సెలబ్రేషన్ కావాలి. ఈ సినిమా ఆ సెలబ్రేషన్ ఇస్తుందని బలంగా నమ్ముతున్నాను. ఈ సినిమాను థియేటర్లలోనే చూడండి .. ఎంజాయ్ చేయండి" అంటూ చెప్పుకొచ్చాడు.