Begin typing your search above and press return to search.
పండగకి వచ్చే బ్లాక్ బస్టర్ ఎలా ఉంటుందో ఇప్పుడు అర్థమైంది!
By: Tupaki Desk | 19 Jan 2022 4:45 AM GMTఇంతవరకూ లవ్ .. యాక్షన్ సినిమాలను ఎక్కువగా చేస్తూ వచ్చిన నాగచైతన్య. 'బంగార్రాజు'తో తన కెరియర్లో తొలిసారిగా ఒక రొమాంటిక్ హీరో రోల్ చేశాడు. అక్కినేని అభిమానులందరితో చిన బంగార్రాజు అనిపించుకుంటున్నాడు. ఈ నెల 14న విడుదలైన ఈ సినిమా, భారీ వసూళ్లను నమోదు చేస్తూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో రాజమండ్రిలో జరిగిన 'బ్లాక్ బస్టర్ మీట్' లో నాగచైతన్య మాట్లాడుతూ .. " రాజమండ్రికి వచ్చిన ప్రతిసారి మీరిచ్చే ప్రేమ .. మీరిచ్చే ఎనర్జీ చూస్తుంటే తిరిగి వెళుతున్నప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుంది.
సినిమా షూటింగు కోసం వచ్చినా .. ఫంక్షన్ కి వచ్చినా ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. మీతో ఒక సెంటిమెంటల్ ఎటాచ్ మెంట్ స్టార్ట్ అయింది. మీరిస్తున్న ఈ సపోర్ట్ కి నేను థ్యాంక్స్ చెబుతున్నాను. ఇలాంటి ఒక పరిస్థితుల్లో ఈ సినిమాను రిలీజ్ చేయడం కరెక్టేనా? కాదా? అనే ఒక భయంతోనే ఈ సినిమాను రిలీజ్ చేయడం జరిగింది. మిమ్మల్ని నమ్మి రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఈ రేంజ్ లో మీరు ఆదరిస్తారని నేను అస్సలు అనుకోలేదు.
మా కెరియర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్ చూపించారు. అలాగే మా కెరియర్లోనే బెస్ట్ కలెక్షన్స్ చూపించబోతున్నారు.
లైఫ్ లాంగ్ మీ అందరికీ రుణపడి ఉంటాను. మీలాంటి అభిమానులు నాకు ఉన్నారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక యాక్టర్ గా బెస్ట్ ఇవ్వాలని ఉన్నప్పటికీ అందుకు ఒక మంచి టీమ్ కావాలి. అలాంటి టీమ్ మాకు దొరికింది. వాళ్లంతా కూడా ఎంతో అంకితభావంతో పనిచేశారు. అందుకు వాళ్లకి థ్యాంక్స్ చెప్పాలి. ఒక సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఎలా ఉంటుందనేది నాన్నగారు ఈ సినిమా ద్వారా చూపించారు. అందుకు మా నాన్నగారికి నేను థ్యాంక్స్ చెబుతున్నాను. ఈ సినిమా స్టార్ట్ చేయడానికి ముందు చాలా భయం ఉండేది .. ఆడియన్స్ ఎలా ఓన్ చేసుకుంటారా అని. కానీ కల్యాణ్ కృష్ణ పక్కనే ఉంటూ .. ఎంతో సహనంతో దగ్గరుండి చేయించాడు.
'రారండోయ్ వేడుక చూద్దాం' ద్వారా మీ అందరికీ దగ్గరగా తీసుకొచ్చిన కల్యాణ్, ఈ సినిమాతో మీకు మరింత దగ్గరగా తీసుకొచ్చాడు. అభిమానులంతా ఆయనను పొగడుతూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా సక్సెస్ వెనుక టీమ్ అంకితభావం ఉంది. రమ్యకృష్ణ గారు అద్భుతంగా చేశారు .. ఇక కృతి శెట్టి హ్యాట్రిక్ హిట్ కొట్టేసింది. ఆమె ఇప్పుడు 'బేబమ్మ'నా? సర్పంచ్ నాగలక్ష్మినా? మీరే చెప్పాలి. ఒక పండుగ బ్లాక్ బస్టర్ ఎలా ఉంటుందనేది నాకు అర్థమైంది. ఒక కమర్షియల్ బ్లాక్ బస్టర్ తో మీ ముందుకు వస్తే ఎలా ఉంటుందనేది ఇప్పుడు తెలుసుకున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు.