Begin typing your search above and press return to search.

సామ్ త‌ర్వాత కాఫీ విత్ క‌ర‌ణ్ షోలో చై

By:  Tupaki Desk   |   31 July 2022 7:30 AM GMT
సామ్ త‌ర్వాత కాఫీ విత్ క‌ర‌ణ్ షోలో చై
X
అక్కినేని నాగ‌చైత‌న్య - స‌మంత బ్రేక‌ప్ చాలా స‌మీక‌ర‌ణాల‌కు దారి తీసింది. ఇప్పుడు ఆ ఇద్ద‌రూ ఎవ‌రికి వారు త‌మ మార్గాల‌ను అనుస‌రిస్తూ మ‌రింత బ‌లంగా మారుతున్నారు. స‌మంత ఇప్ప‌టికే బాలీవుడ్ లో త‌న‌దైన మార్క్ తో దూసుకుపోతోంది. ఇంత‌లోనే నాగ‌చైత‌న్య సైతం త‌న పాన్ ఇండియా ర‌న్ ని స్టార్ట్ చేసారు. ఆ ఇద్ద‌రూ నువ్వా నేనా? అంటూ పోటీప‌డుతున్నారు.

అయితే చైత‌న్య కంటే సామ్ రేస్ లో ముందుగా దూసుకెళుతున్న సంగ‌తి తెలిసిందే. ముంబైలో ప‌ర్ఫెక్ట్ పీఆర్ టీమ్ ని మెయింటెయిన్ చేస్తూ బాలీవుడ్ లో క్రేజీ అవ‌కాశాల‌ను అందిపుచ్చుకుంటోంది. సినిమాలు వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టిస్తూ భారీగా ఆర్జిస్తోంది. ఇటీవ‌ల కాఫీ విత్ క‌ర‌ణ్ సీజ‌న్ 7 లో స‌మంత క‌నిపించిన సంగతి తెలిసిందే. ఈ షో త‌న ఇమేజ్ ని మ‌రింత‌గా పెంచింది. సమంత ప్రభు కాఫీ అరంగేట్రం తర్వాత ఇప్పుడు నాగ చైతన్య కరణ్ జోహార్ షోలో కనిపించాలనుకుంటున్నాడు. అత‌డు ప్రస్తుతం తన బాలీవుడ్ డెబ్యూ లాల్ సింగ్ చడ్డా విడుద‌ల కోసం వేచి చూస్తున్నాడు. అమీర్ ఖాన్ - కరీనా కపూర్ ఖాన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ఆగష్టు 11 న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ప్రస్తుతం టీమ్ ప్ర‌చారంలో జోరుగా పాల్గొంటోంది.

పాపుల‌ర్ చానెల్ కి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కరణ్ జోహార్ సెలబ్రిటీ చాట్ షో కాఫీ విత్ కరణ్ లో కనిపించడం మీకు అభ్యంతరమా? అని చైని అడిగారు. దీనికి అత‌డు ``కాఫీ విత్ కరణ్ లో నాకు అవకాశం వస్తే ఎందుకు చేయకూడదు? కరణ్ జోహార్ గొప్పవాడు. అతడి ప‌నిత‌నం నాకు చాలా ఇష్టం. నన్ను ఎంపిక చేయాలనుకుంటే.. ఎందుకు కాదు?`` అని తిరిగి అడిగారు. ఆసక్తికరంగా అక్షయ్ కుమార్ తో పాటు సమంతా రూత్ ప్రభు క‌ర‌ణ్ చాట్ షోలో అడుగుపెట్టిన కొద్ది రోజులకే చైత‌న్య ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది.

కాఫీ విత్ క‌ర‌ణ్ ఎపిసోడ్ లో తాను .. నాగ చైతన్య విడిపోయిన తర్వాత జీవితం చాలా కష్టంగా ఉందని సమంత తెలిపింది. వారు ఇప్పటికీ ఒకరికొకరు కఠినమైన భావాలను కలిగి ఉన్నామ‌ని కూడా అంగీకరించింది. ``కష్టంగా ఉంది.. కానీ ఇప్పుడు బాగుంది.. పర్లేదు.. నేను ఎప్పుడూ లేనంత బలంగా ఉన్నాను`` అని స‌మంత‌ చెప్పింది. ``మీ ఇద్దరినీ ఒకే గదిలో పెడితే పదునైన వస్తువులు దాచిపెట్టాలనేంత‌టి కఠినమైన భావాలు ఉన్నాయా? అంటే.. అవును.. ప్రస్తుతానికి..`` అని స‌మంత అన్నారు.

నాగ చైతన్య డెబ్యూ మూవీ `లాల్ సింగ్ చడ్డా`తో సత్తా చాటాల‌ని ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ చిత్రం ఆగస్టు 11 న థియేటర్లలోకి రానుంది.
ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో చైత‌న్య ఆస‌క్తికర విష‌యాల‌ను షేర్ చేస్తున్నారు. అదే ఇంటర్వ్యూలో నాగ చైతన్య తన వ్యక్తిగత జీవితం తన వృత్తిపరమైన కట్టుబాట్లను ఎలా ప్రభావితం చేయకూడదనే దాని గురించి ఓపెన‌య్యాడు.

నా వ్యక్తిగత జీవితం వృత్తిగ‌త‌ జీవితాన్ని ప్రభావితం చేయని విధంగా నన్ను నేను నిర్మించుకున్నాను. మీడియాలో వృత్తిగ‌త జీవితాన్ని మించి వ్యక్తిగత జీవితం ముఖ్యాంశంగా మారినప్పుడు అది కొంచెం చికాకును నిరాశను కలిగిస్తుంది. నిజానికి వ్యక్తిగత .. వృత్తిపరమైన జీవితాలు కనెక్ట్ అవ్వ‌డం నాకు నచ్చదు. నేను ఆ రెండిటినీ క‌ల‌ప‌ను. రెండింటి మధ్య చాలా స్పష్టమైన అడ్డంకిని సృష్టించాను! అని చైత‌న్య అన్నారు. చై- సామ్ నాలుగేళ్ల కాపురం అనంత‌రం విడిపోతున్న‌ట్టు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.