Begin typing your search above and press return to search.
చైతూ బోడి బాలరాజుగా అదరగొట్టేశాడు!
By: Tupaki Desk | 3 Aug 2022 11:46 AM GMTబాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ `లాల్ సింగ్ చడ్డా`. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. టామ్ హంక్స్ నటించిన హాలీవుడ్ మూవీ `ఫారెస్ట్ గంప్` ఆధారంగా ఈ సినిమాని హిందీలో రీమేక్ చేశారు. అమీర్ ఖాన్ నటించి కిరణ్ రావు, అజిత్ దేశ్ పాండే, రాధికా చౌదరిలతో కలిసి సంయుక్తంగా నిర్మించారు. కరీనా కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో టాలీవుడ్ హీరో నాగచైతన్య కీలక అతిథి పాత్రలో నటించారు. ఇదే తనకు తొలి బాలీవుడ్ ఫిల్మ్.
ఆగస్టు 11న భారీ స్థాయిలో హిందీతో పాటు తెలుగులోనూ విడుదల కాబోతోంది. తెలుగులో ఈ మూవీకి మెగాస్టార్ చిరంజీవి సమర్పకుడిగా వ్యవహరిస్తుండగా గీతా ఆర్ట్స్ సంస్థపై అల్లు అరవింద్ విడుదల చేస్తున్నారు. సినిమా రిలీజ్ కు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ ని ప్రారంభించారు. ఇందులో భాగంగా హీరో నాగచైతన్య పాత్రకు సంబంధించిన వీడియోని విడుదల చేశారు. చై నటిస్తున్న తొలి బాలీవుడ్ మూవీ కావడంతో ఈ మూవీపై అక్కినేని ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.
తాజాగా విడుదల చేసిన వీడియోలో నాగచైతన్య పాత్రని మలిచిన తీరు, షూటింగ్ లో చైతో పాటు టీమ్ పడిన కష్టాన్ని చూపించారు. ఇందులో నాగచైతన్య బాలరాజు బోడి పాత్రలో కనిపించాడు. ఈ పాత్ర గురించి చై వివరిస్తూ..ఈ స్క్రిప్ట్ నా దగ్గరికి వచ్చినప్పుడు నా పాత్ర పేరు బాల. ఏపీలోని బోడిపాలం నుంచి ఆర్మీలో చేరేందుకు వచ్చిన ఓ యువకుడు. ఆ తరువాత బాల పేరుని బాలకృష్ణ.. బలరామ్ సహా నాలుగైదు పేర్లు అనుకున్నాం. అయితే ఫైనల్ గా అద్వైత్ కి, అమీర్ కి బాలరాజు పేరు బాగా నచ్చింది.
ఊరు పేరు గురించి రీసెర్చ్ చేస్తుంటే ఏపీలోని బోడిపాలెంని గుర్తించాం. అక్కడి నుంచే బాలరాజు బోడిపాలం అనే పేరు పుట్టింది. పేరు అంతా సెట్టయ్యాక తెలిసింది ఏంటంటే 1948లో తాతగారి సినిమా బాలరాజు విడుదలైంది. తెలుగు సినిమాల్లోనే ఇది ఫస్ట్ సిల్వర్ జూబ్లీ మూవీ. ఆ పేరునే నా పాత్రకు సెట్టవడం చాలా చాలా స్పెషల్ గా అనిపించింది. లుక్ కు సంబంధించి చాలా టైమ్ తీసుకున్నాం. మీసం ఇంత వరకు నేను ట్రై చేయలేదు. ట్రై చేసిన తరువాత చాలా స్పెషల్ గా అనిపించింది. అంతే కాకుండా మౌత్ పీస్ ని క్యారీ చేశాం. దాని వల్ల క్యారెక్టర్ కి యునిక్‌నెస్ వచ్చింది.
విజువల్ పరంగానే కాకుండా డైలాగ్ డిక్షన్ కూడా మారింది. ఈ రెండే కలిపి క్యారెక్టర్ చాలా బాగా వర్కవుట్ అయింది. ఒక షూటింగ్ అయిపోయింది అన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీలవుతాం. నెక్స్ట్ సినిమాకు వెళ్లిపోతాం. కానీ`లాల్ సింగ్ చడ్డా` షూటింగ్ పూర్తయింది అన్నరోజున చాలా ఎమోషనల్ గా ఫీలయ్యాను. ఎందుకంటే ఆరు ఏడు నెలలు ఈ టీమ్ తో ట్రావెల్ అయ్యాను. అందరితో ఎక్కడో నాకు ప్రత్యేకమైన బాండింగ్ ఏర్పడింది.
బాలరాజు క్యారెక్టర్ లోనే వుండిపోయాను. అమీర్ గారిని కలిసిన ఫస్ట్ డే నుంచి శ్రీనగర్ లో షూటింగ్ జరిగిన లాస్ట్ డే వరకు ప్రతీ మూవ్ మెంట్ నాకు చాలా చాలా స్పెషల్` అని బాలరాజు పాత్ర వెనకున్న ఆసక్తికరమైన స్టోరీని వెల్లడించారు నాగచైతన్య. టీమ్ రిలీజ్ చేసిన వీడియో నెట్టింట సందడి చేస్తోంది. డిఫరెంట్ వేరియేషన్స్ వున్న బాలరాజు పాత్రలో నిజంగా చెప్పాలంటే చై అదరగొట్టేశాడు.