Begin typing your search above and press return to search.
బాపు బొమ్మల్ని అద్దెకు తెచ్చినార్రో!
By: Tupaki Desk | 11 Aug 2018 4:50 AM GMTఅక్కినేని నాగచైతన్య - అనూ ఇమ్మాన్యుయేల్ రొమాంటిక్ కపుల్ గా నటించిన `శైలజారెడ్డి అల్లుడు` ఈనెల 31న రిలీజవుతున్న సంగతి తెలిసిందే. అత్త శైలజ పాత్రలో రమ్యకృష్ణ అభినయించడం ఈ సినిమాకి కలిసొచ్చే యూఎస్ పీ. దర్శకుడిగా చక్కని విజయాలతో జోరుమీదున్న మారుతి దాసరి ఈ చిత్రం కోసం ప్రాణం పెట్టి పని చేశారన్న టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో పాటలకు చైతూ అభిమానుల నుంచి చక్కని స్పందన వచ్చింది. రీసెంటుగా రిలీజైన అనుబేబి సాంగ్ కి స్పందన బావుంది. విజువల్ గా చూస్తే పాటల్లో నాగ చైతన్య అల్లరి అల్లుడు రేంజులో చెలరేగుతున్నాడనంలో సందేహం లేదు.
తాజాగా రిలీజైన ఫోటోల్లో చైతూ రొమాన్స్ పీక్స్ లో ఆకట్టుకుంటోంది. పాటల్లో నాగచైతన్య - అనూ ఇమ్మాన్యుయేల్ మధ్య కెమిస్ట్రీ అద్భుతం అన్న టాక్ వినిపిస్తోంది. ఇకపోతే వీటన్నిటికీ మించి పాటల్లో ఉపయోగించిన బ్యాక్ గ్రౌండ్ ఆర్ట్ ఫెంటాస్టిక్ అని లేటెస్ట్ ఫోటోలు చెబుతున్నాయి. ఇంతకాలం విదేశీ సొగసుల్ని ఎక్స్ పోజింగ్ - గ్లామర్ ఎలివేషన్ పార్ట్ కి - అథ్లెటిక్ ఫీట్స్ కి ఉపయోగించుకున్న తెలుగు సినిమా ఇందులో కొత్తగా ఉపయోగించుకోవడం షాకింగ్ సర్ ప్రైజ్ అనే చెప్పాలి.
ఈ పాటకు ఎంచుకున్న లొకేషన్ల బ్యాక్ గ్రౌండ్ - అలానే నేపథ్యంలో కనిపించే విదేశీ డ్యాన్సర్ల మేకప్ - డిజైనర్ శారీ స్టైల్.. చెపన చేరడేసి మందారం.. సంథింగ్ స్పెషల్ అని ఈ ఫోటోలు చెప్పకనే చెబుతున్నాయి. విదేశీ బొమ్మలు అంతందంగానా.. ఆర్ట్ వండర్ ఫుల్ కదూ? బాపు బొమ్మల్ని అద్దెకు తెచ్చినట్టు! అన్న మాటా వినిపిస్తోంది. బాపు ఆర్ట్ నుంచి జాలువారిన ముగ్ధల్లా విదేశీ అందగత్తెల్ని మేకప్ స్పెషల్ గా కనిపిస్తోంది. బ్యాక్ గ్రౌండ్ ట్రూప్ ఇంప్రెస్సివ్ అని చూడగానే చెప్పేయొచ్చు. ఇక విజువల్‌గానూ కె.రాఘవేంద్రరావు సాంగ్ మేకింగ్ లా రసరమ్యంగా ఉంటుందనే అర్థమవుతోంది. మొత్తానికి రొమాంటిక్ ఫెలో ఆడియెన్ కి కావాల్సిన మసాలా అంతా పాటల్లో దొరుకుతుందనడంలో సందేహమే లేదు.