Begin typing your search above and press return to search.

కేరళతో మళ్ళీ హిట్టు కొడతారా?

By:  Tupaki Desk   |   8 Jun 2015 7:21 PM IST
కేరళతో మళ్ళీ హిట్టు కొడతారా?
X
ఎటు చూసినా చుట్టూ వలయంలా అల్లుకుపోయిన కొబ్బరి చెట్లు, సుదీర్ఘమైన కెనాల్స్‌, పచ్చని హరితవనం అందాలు కేరళ ప్రత్యేకత. దీనికితోడు సుదీర్ఘమైన సముద్ర తీరం కేరళకు అదనపు ఆకర్షణ. అందుకే ఇక్కడ షూటింగులకు వెళ్లాలంటే సినిమా జనం ఎగిరి గంతేస్తారు. ముఖ్యంగా తమిళ స్టార్‌ డైరెక్టర్‌ గౌతమ్‌మీనన్‌కి కేరళ అంటే ప్రత్యేకమైన అభిమానం.

అక్కడి అందాల్ని తన సినిమాల్లో బంధించి ప్రేక్షకులకు చూపిస్తుంటాడు. ఇప్పటికే కేరళ అందాల్ని ఏమాయ చేశావే చిత్రంలో చూపించాడు. ఆ తర్వాత కూడా అతడు తెరకెక్కించిన చాలా సినిమాల్లో కేరళ అందాల్ని హైలైట్‌ చేశాడు. మరోసారి తెలుగు ప్రేక్షకులకు మలబారు అందాల్ని వీక్షించే అదృష్టం కలిగించబోతున్నాడు. ఏమాయ చేశావే కాంబినేషన్‌ మరోసారి మనముందుకు వస్తోంది. ప్రస్తుతం కేరళలోని అందమైన లొకేషన్లలో షూటింగ్‌ చేస్తున్నారు.

తెలుగు వెర్షన్‌లో నాగచైతన్య, తమిళ వెర్షన్‌లో శింబు కథానాయకులుగా నటిస్తున్నారు. రెండు చోట్లా మలయాళీ బ్యూటీ మాంజిమా మోహన్‌ కథానాయికగా నటిస్తోంది. నాగచైతన్య, గౌతమ్‌ మీనన్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఓ అందమైన ప్రేమకథా చిత్రం. మరోసారి ఏమాయ చేశావే ఫలితాన్ని రిపీట్‌ చేస్తుందనే చెబుతున్నారు. వెయిట్‌ అండ్‌ సీ.