Begin typing your search above and press return to search.

బమ్మతో జూనియర్‌ బంగార్రాజు..!

By:  Tupaki Desk   |   23 Jun 2022 3:37 AM GMT
బమ్మతో జూనియర్‌ బంగార్రాజు..!
X
బంగార్రాజు సినిమాలో నాగ చైతన్య మరియు కృతి శెట్టి జోడీకి మంచి పేరు దక్కింది. సినిమా కూడా కమర్షియల్‌ గా హిట్‌ అయిన విషయం తెల్సిందే. నాగ చైతన్య మరియు కృతి శెట్టిల జోడీ వెంటనే రిపీట్ అవ్వబోతుంది. ఉప్పెన సినిమా తో కెరీర్‌ ను ఆరంభించిన కృతి శెట్టి మొదటి సినిమా టైటిల్ కు తగ్గట్లుగానే కెరీర్ లో దూసుకు పోతుంది.

ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయి. ఇటీవలే ఈ అమ్మడు ఒక పెద్ద హీరోకు జోడీగా నటించే అవకాశం దక్కించుకుందనే వార్తలు వచ్చాయి. ఇదే సమయంలో మళ్లీ నాగ చైతన్య కు కూడా ఈ అమ్మడు జోడీగా నటించేందుకు సైన్ చేసిందని తెలుస్తోంది. కృతి శెట్టి వరుసగా చేస్తున్న సినిమాల జోరు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది.

ఈ అమ్మడు వచ్చే ఏడాది వరకు ఇండస్ట్రీ లో టాప్‌ స్టార్‌ హీరోయిన్స్ జాబితాలో చేరడం మాత్రమే కాకుండా అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ గా కూడా మారే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అక్కినేని హీరో నాగచైతన్యకు జోడీగా నటించేందుకు కమిట్‌ అవ్వడంతో తన సినిమాల సంఖ్య మరింతగా పెంచుకుంది.

నాగ చైతన్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ సమయంలోనే తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఒక సినిమాకు కమిట్‌ అయ్యాడని చాలా రోజులుగా వార్తలు వచ్చాయి. ఇటీవలే ఆ సినిమా గురించి క్లారిటీ కూడా వచ్చింది. తెలుగు లో వెంకట్ ప్రభు మొదటి సారి చేయబోతున్న నేపథ్యంలో అక్కడ ఇక్కడ కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

షూటింగ్ ప్రారంభోత్సవంకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. తెలుగు తో పాటు తమిళంలో కూడా ఏక కాలంలో ఈ సినిమాను విడుదల చేసేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నారట. అందుకే ఈసినిమా లో హీరోయిన్ గా తమిళనాట కూడా గుర్తింపు ఉన్న ముద్దుగుమ్మ కృతి శెట్టిని ఎంపిక చేయడం మంచి నిర్ణయం.

ఇప్పటి వరకు కృతి శెట్టి నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఉప్పెన.. శ్యామ్‌ సింగ రాయ్‌.. బంగార్రాజు సినిమా లు మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. త్వరలోనే ఎనర్జిటిక్ స్టార్‌ రామ్‌ తో కలిసి నటించిన ది వారియర్‌ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఆ సినిమా కూడా హిట్ అయితే ఈ అమ్మడి క్రేజ్ మరింత పెరగడం ఖాయం.