Begin typing your search above and press return to search.
ఆ ఇద్దరూ అనుకునే ఆర్మీలో చేరారా!
By: Tupaki Desk | 22 Nov 2019 1:30 AM GMTబార్డర్ లో దేశానికి గస్తీ కాసే ఆర్మీ జవాన్ల సాహసాలు త్యాగాల గురించి ఎంత చెప్పినా తక్కువే. అందునా కశ్మీర్ బార్డర్.. పాకిస్తాన్ బార్డర్ లో కాపలా కాసే సైనికులు అంటే వారి సాహసాలకు అంతూ దరీ ఉండదు. ఎట్నుంచి ఏ ముప్పు పొంచి ఉంటుందో చెప్పలేం. మరోవైపు నిరంతరం మంచులో గడ్డకట్టుకుపోయే పరిస్థితి ఉంటుంది. అలాంటి చోట శత్రువును దేశంలో జొరబడనీకుండా ఎదుర్కోవాలి. పైగా తీవ్రవాదులను ఎదురించి పోరాడాలి. ఇన్ని చేస్తారు కాబట్టే సైనికులు అంటే ప్రజలకు అంతే గౌరవం గురి ఉంటాయి.
ప్రస్తుతం వరుసగా ఆర్మీ నేపథ్యంలో సినిమాలు రిలీజ్ లకు వస్తున్నాయి. డిసెంబర్ 13న రిలీజవుతున్న వెంకీ మామ చిత్రంలో నాగ చైతన్య పాత్ర ఆర్మీ నేపథ్యంలోనే ఆద్యంతం రక్తి కట్టిస్తుందట. ఊళ్లో మామతో బోలెడంత కామెడీలు చేసే చైతూ ఆర్మీ కెప్టెన్ గా మారాక అంతే సీరియస్ గా ఎమోషనల్ గా కనిపిస్తాడట. మొన్న దీపావళి పండక్కి చైతూ ఆర్మీ లుక్ రివీల్ చేశారు. దానికి అద్భుత స్పందన వచ్చింది. ఇక ఈ చిత్రంలో చైతన్య పాత్ర ఏది? అంటే.. కెప్టెన్ కార్తీక్ గా వార్ లోకి దిగుతాడట. ``ఇప్పటివరకు నాలోని ఫన్ యాంగిల్ చూశారు, ఇప్పుడు నాలోని దేశభక్తిని చూడండి`` అంటూ ఈ శుక్రవారం టీజర్ తో అభిమానుల ముందుకు వస్తున్నాడు. ఫ్యాన్స్ కి నవంబర్ 23న బర్త్ డే ట్రీటిస్తున్నాడు చైతూ.
అలాగే సంక్రాంతి బరిలో వస్తున్న `సరిలేరు నీకెవ్వరు` చిత్రంలో మహేష్ మిలటరీలో మేజర్ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆర్మీ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో మహేష్ నటిస్తున్నారు. ఆర్మీ అధికారి పాకెట్ పై ఉండే బ్యాడ్జ్ పై అజయ్ కృష్ణ అన్న పేరును ఇంతకుముందు రివీల్ చేశారు. హిలేరియస్ కామెడీ ఎంటర్ టైనర్ లో ఆర్మీ నేపథ్యం హైలైట్ గా ఉండనుందట.
ఆర్మీ జవాన్ పాత్ర అనగానే బ్లాక్ బస్టర్ మూవీ `యూరి`లో విక్కీ కౌశల్ యువతరానికి గుర్తుకు వస్తుంటాడు. అంతకుముందు తుపాకిలో ఇలయదళపతి విజయ్ అంతే ప్రామిస్సింగ్ పెర్ఫామెన్స్ తో మెప్పించాడు. అందుకే ఇప్పుడు ఆర్మీ పాత్రల్లో మహేష్.. నాగచైతన్య ఏ తీరుగా మెప్పించనున్నారో చూడాలన్న ఆసక్తి పెరిగింది. ఫన్.. ఎంటర్ టైన్ మెంట్ పేరుతో ఆర్మీ పాత్రల్ని తక్కువ చేసి చూపిస్తే మాత్రం అభిమానులు అంగీకరించరు. మరి ఆ మేరకు మేకర్స్ ఆ పాత్రల్ని ఎలివేట్ చేయడంలో జాగ్రత్త తీసుకున్నారనే భావిద్దాం.