Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: నేత చీరలో బుజ్జి కుచ్చి
By: Tupaki Desk | 8 Aug 2017 4:16 AM GMTసమంత ఎన్ని ఫ్యాషన్ డ్రెస్స్ లు వేసుకొని కనిపించినా అభిమానాలుకు ఆనందంగానే ఉంటుంది. కాని చీరకట్టుకొని కనిపిస్తే మాత్రం ఏమాయ చేసావే సినిమాలో జస్సీ ని ఒక సారి తలుచుకొని తృప్తి చెందుతూ ఉంటారు. తెలంగాణ రాష్ట్ర చేనేత పరిశ్రమకు ప్రచారకర్తగా సమంత ఉన్న విషయం మనకు తెలిసింది. అయితే నేషనల్ హ్యాండ్లూమ్ డే సందర్భంగా వోవెన్ – ఏ వాక్ టు ఫ్యాషన్ అనే ఒక ఈవెంట్ జరిగింది హైదరాబాద్ లో. తెలంగాణ మంత్రి కే. తారక రామారావు ఈ కార్యక్రమానికి ప్రారంబించి కొన్ని కొత్త చేనేత పరిశ్రమకు చేయూత పధకాలును వెల్లడించారు. ఈ వేడుకలో సమంత అండ్ నాగ చైతన్య కూడా పాల్గొన్నారు.
వోవెన్ – ఏ వాక్ టు ఫ్యాషన్ ఈవెంట్ లో సమంత ఒక సాదా చేనేత చీరను ఫ్యాషన్ గా చుట్టుకొని వచ్చి అందరిని వావ్ అనేలా చేసింది. పోచంపల్లి చీరను పొలం గట్టు మీద ఎంకి పాటలో మరదలు పిల్లలాగా చుట్టి నల్లని జాకెట్ వేసుకొని మెరిసే జుంకీలు పెట్టుకొని తన లేత అందాలుతో ఇలా ఫోజ్ ఇచ్చింది. మన పాత పద్దతులకు కొత్త అందం అద్ది సాదాతనాన్నికి మరింత సోయగం వచ్చినట్లు ఉంది సమంతను చూస్తుంటే. మన ఆచారాలు ఎప్పటికీ అంతంకావు అవి ఇలా రూపాలు మారుతూ ఉంటుంది అంతే, ఇక్కడ సమంతను చూస్తే అలానే అనిపిస్తుంది. ఇక శిల్పా రెడ్డి డిజైన్ చేసిన బట్టలు వేసుకుని నాగ చైతన్య కూడా ర్యాంప్ వాక్ చేశాడు. ఆ తరువాత మనోడు సమంత పక్కన కూర్చోగా.. సమంత ఇలా బుజ్జి కుచ్చిలా చైతూ చెయ్యి పట్టుకుని కూర్చుంది. ఈ సీన్ చూసినోళ్లు వావ్ అనుకోక మానరు.
ఇకపోతే వోవెన్ – ఏ వాక్ టు ఫ్యాషన్ లో తెలంగాణ చేనేత వస్త్రాలు అన్నీ ప్రదర్శన కు పెట్టారు. కొంత మంది మోడల్లు కూడా పాల్గొని సాంప్రదాయ పద్దతిలో నేసిన చీరలును కట్టి ఫ్యాషన్ వాక్ కూడా చేశారు. అది సంగతి.