Begin typing your search above and press return to search.

చెయ్-శామ్.. రెండు రకాల నిశ్చితార్ధాలు

By:  Tupaki Desk   |   29 Jan 2017 7:04 PM GMT
చెయ్-శామ్.. రెండు రకాల నిశ్చితార్ధాలు
X
నాగ చైతన్య-సమంత.. సుదీర్ఘ కాలం నుంచి ఫ్రెండ్స్ అండ్ లవర్స్. ఈ విషయాన్ని వాళ్లే స్వయంగా చెప్పుకొచ్చారు. మొదట్లో దాచిపెట్టేందుకు ప్రయత్నించి.. తర్వాత వాళ్లే మెల్లగా లీకులు ఇచ్చి అసలు విషయం చెప్పేశారు. ఇప్పుడు వీళ్ల లవ్ స్టోరీ ఎంగేజ్మెంట్ వరకూ వచ్చేసింది. అయితే.. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఒకటి ఉంది.

సెలబ్రిటీలు పెళ్లి చేసుకోవడం పెద్ద టాపిక్ కాదు కానీ.. చైతు-సమంతల లవ్ మాత్రం ఎక్కువగా మీడియా నోళ్లలో నానడానికి కారణం.. వీళ్లిద్దరి మతాలు వేరు కావడమే. నాగ చైతన్య హిందూ సాంప్రదాయాలను పాటించే టాలీవుడ్ హీరో. సమంత క్రిస్టియానిటీని నమ్మిన హీరోయిన్. మరి వీరిద్దరి లవ్ అంటే ఓకే.. మరి ఎంగేజ్మెంట్.. మ్యారేజ్.. ఏ రకంగా జరుగుతాయనే ఆసక్తి అందరిలోనూ ఉంది. దీనికి నిశ్చితార్ధం రోజున ఓ సమాధానం దొరికేసిందనే చెప్పాలి. ఒకే నిశ్చితార్ధ వేడుకలో.. ఇటు హిందూ సంప్రదాయాలతో పాటు అటు క్రైస్తవ పద్ధతులతో సహా ఎంగేజ్మెంట్ జరగడం విశేషం.

చర్చ్ ఫాదర్ ఇద్దరి నిశ్చితార్ధాన్ని దగ్గరుండి జరిపించగా.. ఆ తర్వాత హిందూ సంప్రదాయాల ప్రకారం బొట్టు పెట్టించుకుని మరీ హోమం చేసేసింది సమంత. మరి కొన్ని నెలల్లో జరగనున్న పెళ్లి కూడా ఇలాగే రెండు రకాలుగా జరగనుందనే టాక్ ఇప్పటికే ఉంది. మొదట చెన్నైలో క్రిస్టియన్ పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకుని.. ఆ తర్వాత హిందూ ట్రెడిషన్స్ ప్రకారం పెళ్లి చేసుకోనున్నారట. ఈ రెండింటికీ ఎక్కువమందినీ పిలవకపోయినా.. ఆ తర్వాత జరిపే రిసెప్షన్ కి మాత్రం మొత్తం ఇండస్ట్రీ జనాలను ఆహ్వానించనున్నట్లు టాక్.

నాగ చైతన్య సమంత ఎంగేజ్మెంట్ ఫొటోస్ కోసం ఈ లింక్ క్లిక్ చెయ్యండి : https://goo.gl/ZSbWa8