Begin typing your search above and press return to search.
సమంత ఇన్సిపిరేషన్ గా చెమటోడుస్తున్న చైతూ
By: Tupaki Desk | 25 Jun 2021 7:30 AM GMTటాలీవుడ్ స్టార్స్ హీరోయిన్స్ లో ఎక్కువగా వర్కౌట్స్ చేసే హీరోయిన్స్ జాబితాలో సమంత ముందు వరుసలో ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆమె వర్కౌట్ విషయంలో ఇతరులకు ఆదర్శంగా నిలుస్తూ ఉంటుంది. సమంత రెగ్యులర్ గా చేసే వర్కౌట్ లు హీరోలు కూడా చేయరు అనే టాక్ కూడా ఉంది. ఆమె ప్రతి రోజు తన బాడీని వర్కౌట్స్ పేరుతో హింసిస్తూనే ఉంటుంది. అందుకే ఆమె అంత అందంగా ఉందని అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇప్పుడు సమంత ఇన్సిపిరేషన్ గా యంగ్ స్టార్ హీరో నాగచైతన్య కూడా వర్కౌట్ లు మొదలు పెట్టాడని.. ఆయన తదుపరి సినిమా కోసం ఏకంగా సిక్స్ ప్యాక్ ట్రై చేస్తున్నట్లుగా చెబుతున్నారు.
చైతూ రెగ్యులర్ గా కూడా వర్కౌట్స్ చేస్తాడు. కాని ప్రస్తుతం మాత్రం ఆయన సిక్స్ ప్యాక్స్ కోసం అంతకు మించి అన్నట్లుగా కష్టపడుతున్నాడట. సమంత మరియు నాగ చైతన్యలు తమ హోమ్ జిమ్ లో రెగ్యులర్ గా గంటలకు గంటలు వర్కౌట్స్ చేస్తూనే ఉన్నారని వారి సన్నిహితులు అంటున్నారు. నాగచైతన్య ఇప్పటికే లవ్ స్టోరీ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉన్నాడు. ఇక విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న థ్యాంక్యూ సినిమా కూడా ముగింపుకు వచ్చేసింది. ఈ సమయంలో మరో సినిమా ను ఆయన కమిట్ అయ్యాడట.
కొత్తగా కమిట్ అయిన సినిమా కోసం ఆయన సిక్స్ ప్యాక్ చేస్తానని హామీ ఇచ్చాడట. అందుకే చైతూ చాలా కష్టపడుతూ సమంత తో కలిసి గంటలకు గంటలు జిమ్ లో వర్కౌట్ లు చేస్తున్నట్లుగా నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సమంత మరియు నాగచైతన్యలు కలిసి మళ్లీ ఒక సినిమా చేస్తూ చూడాలని అభిమానులు ఆశ పడుతున్నారు. మరి కొత్తగా ఓకే చేసిన సినిమా లో అయినా సమంతతో చైతూ రొమాన్స్ చేస్తాడేమో చూడాలి.