Begin typing your search above and press return to search.
పోస్టర్ టాక్: భిన్న ధృవాల మజిలి
By: Tupaki Desk | 2 March 2019 4:26 AM GMTమనం తర్వాత నిజ జీవితంలో దంపతులైన నాగ చైతన్య సమంతాలు కలిసి నటిస్తున్న మజిలి వచ్చే నెల విడుదలకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ప్రేమికుల రోజున విడుదల చేసిన టీజర్ కు ఇప్పటికే మంచి స్పందన దక్కిన నేపధ్యంలో అభిమానుల అంచనాలు దీని మీద చాలా గట్టిగా ఉన్నాయి. తాజాగా సినిమా తాలుకు కొత్త పోస్టర్ ను చైతు తన ఫ్యాన్స్ కోసం షేర్ చేసుకున్నాడు. తాను ఎక్కడో ముభావంగా చూస్తూ ఉండగా పక్కనే ఉన్న సమంతా అతనికేసే ప్రేమగా లాలనగా చూపులు విసురుతున్న పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది.
టీజర్ లో చూపించిన దాని ప్రకారం ఇందులో చైతు సమంతాలకు పెళ్ళైనా ఇద్దరివి భిన్న ధృవాలు కావడంతో పాటు చైతన్యకు ఏదో వృత్తిపరమైన డిస్టర్బెన్స్ ఉంటుంది. దాని వల్లే సామ్ ని దగ్గరకు తీసుకోకుండా ఉంటాడు. ఈ దంపతుల ప్రయాణమే మజిలి. నానికి నిన్ను కోరి లాంటి డీసెంట్ లవ్ స్టొరీని హిట్ రూపంలో ఇచ్చిన శివ నిర్వాణ దీనికి దర్శకత్వం వహించడం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.
ఎమోషన్స్ ని అతను ప్రెజెంట్ చేసే తీరు హత్తుకునేలా ఉండటంతో నిన్ను కోరి కథలో కొత్తదనం లేకపోయినా ఈ కారణంగానే ప్రేక్షకులు ఆదరించారు. నాని నివేదాల మధ్యే అంత సెన్సిటివ్ లవ్ ని చూపించిన శివ నిర్వాణ రియల్ లైఫ్ కపుల్ ని ఎలా చూపిస్తాడు అనే అంచనాలు ఉండటం సహజం. గత రెండేళ్ళుగా సరైన సక్సెస్ లేక స్ట్రగుల్ అవుతున్న చైతుకు ఏప్రిల్ 5 విడుదల కానున్న మజిలి పెద్ద బ్రేక్ ఇస్తుందనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు.