Begin typing your search above and press return to search.

రీల్ లైఫ్.. రియల్ లైఫ్.. అవే రోల్స్

By:  Tupaki Desk   |   25 May 2018 4:25 AM GMT
రీల్ లైఫ్.. రియల్ లైఫ్.. అవే రోల్స్
X
నిజ జీవితంలో బంధువులయిన వారు తెరమీద కూడా అదే బంధుత్వంతో ఉన్న పాత్రలు చేస్తే చూడటానికి భలే ముచ్చటగా ఉంటుంది. ఇండస్ట్రీలో ఫేమస్ అయిన ఎందరో స్టార్లు తమ కొడుకులతో కలిసి చాలా సినిమాల్లోనే నటించారు. కానీ మేనమామ - మేనల్లుడు కలిసి ఒక సినిమాలో కలిసి నటించడం.. అందులోనూ అవే పాత్రలు చేయడం అన్నది చాలా అరుదనే చెప్పాలి.

అక్కినేని హీరో నాగచైతన్య తన మేనమామ వెంకటేష్ తో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నాడు. ముగ్గురు అన్నదమ్ముల కథతో జైలవకుశ సినిమా తీసిన డైరెక్టర్ కె.ఎస్.రవీంద్ర (బాబీ) ఈ కథ స్టోరీ లైన్ సిద్ధం చేశాడని తెలుస్తోంది. మేనమామ - మేనల్లుడి మధ్య ఉండే చక్కని అనుబంధం మెయిన్ హైలైట్ గా సినిమా తెరకెక్కనుంది. సినిమాకు లీడ్ క్యారెక్టర్ల మధ్య ఉండే అనుబంధమే కీలకం కానున్నందున ఏరికోరి నిజజీవితంలో మామా అలుళ్లయిన వెంకటేష్ - నాగచైతన్య ను ఈ పాత్రల కోసం ఎంచుకున్నాడు. ఈ సినిమాకు మామా అల్లుళ్ల నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో డైరెక్టర్ బాబీ స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో పడ్డాడు.

వెంకటేష్ - నాగచైతన్య ఇంతకుముందు ఓ సినిమాలోనూ మామా అల్లుళ్లుగా నటించారు. చై హీరోగా నటించిన ప్రేమమ్ సినిమాలో వెంకటేష్ అతడి మామయ్యగా కామియో రోల్ చేశాడు. ఇప్పుడు తొలిసారి ఫుల్ లెంగ్త్ రోల్ చేయడానికి రెడీ అవడం అభిమానులను ఖుషీ చేస్తోంది. ఇందులో చైతన్య హీరోయిన్ గా రకుల్ ప్రీత్ ను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. వెంకటేష్ కు జోడీ కోసం వెతుకులాడుతున్నారు.