Begin typing your search above and press return to search.
నాగచైతన్య కెరీర్ పరంగా చాలా డిస్ట్రబ్డ్‌గా ఫీలయ్యారా?
By: Tupaki Desk | 22 July 2022 10:30 AM GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతీ హీరోకు ఓ విజన్ వుంది. తన నుంచి ప్రేక్షకులు, అభిమానులు ఎలాంటి సినిమాలని కోరుకుంటున్నారో పూర్తి స్పష్టతతో వున్నారు. పాన్ ఇండియా సినిమాల క్రేజ్ నడుస్తున్న నేపథ్యంలో చాలా వరకు హీరోలు పాన్ ఇండియా మూవీస్ తో ప్రేక్షకుల్ని అభిమానుల్ని ఆకట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రభాస్ నుంచి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ వరకు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో బిజీగా వున్నారు. అయితే యంగ్ హీరో నాగచైతన్య మాత్రం ఇందుకు భిన్నంగా అడుగులు వేస్తున్నారు. ఆయన నటించిన తాజా మూవీ `థాంక్యూ` ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరో నాగచైతన్య తన కెరీర్, చుట్టూ వున్న వాళ్ల కారణంగా మొహమాటానికి అంగీకరించిన సినిమాల గురించి పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. నిజాయితీగా చెప్పాలంటే `మజిలీ` మూవీకి ముందు కెరీర్ పరంగా చాలా డిస్ట్రబ్డ్‌గా వున్నాను. నాకు కంఫర్ట్ గా వున్న కథలు కరెక్ట్ గా సెట్టవ్వట్లేదా.. లేకపోతే నా జడ్జిమెంట్ లో తప్పు జరుగుతోందా?.. సినిమాలు చేస్తున్నాను.. సక్సెస్ వస్తున్నాయి కానీ కావాల్సినంత సక్సెస్ మాత్రం రావడం లేదు.
కొన్ని సినిమాలని కమర్షియల్ గా చేయాలని ఒప్పుకున్నాను. కొన్ని సినిమాలు.. ఓకే మనం యాక్షన్ చేయాలి కదా అంటే ఒప్పుకున్నాను. అంతే కాకుండా నంబర్ ఆఫ్ ప్రెజర్స్ వల్ల వాటికి ప్రభావితమై అంగీకరించిన సినిమాలున్నాయి. అంతే కాకుండా నా ఆలోచనా విధానంలో కూడా క్లారిటీ లేదు. అప్పుడు ఆలోచించాను.. ఏంటీ మన ప్రాసెస్ మార్చాలా? అని ఆలోచించడం మొదలు పెట్టాను. ఎవరు ఏం చెప్పినా మర్చిపోయి పూర్తిగా నా నిర్ణయాన్ని బట్టే ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాను. చుట్టూ వున్న వాళ్ల వళ్లే ఇంత కాలం ప్రభావితం అవుతూ సినిమాలు చేశాను.
కొంత మందేమో ఇన్ని ఫైట్స్, ఇన్ని పాటలు వుండాలంటారు..కొంత మందేమో కలెక్షన్స్ గురించి ఆలోచించాలంటారు.. మరి కొంత మంది ఓపెనింగ్స్ గురించి ఆలోచించాలంటారు. ఇలా చుట్టూ వున్న వాళ్ల ఆలోచనల్లో ఏది పర్ ఫెక్ట్ అని ఆలోచించే మెచ్యూరిటీ ఇంకా నాకు రాలేదు. అయితే మైండ్ క్యాలిక్యులేషన్స్ కాకుండా హృదయం ఎలా స్పసందిస్తే దాన్ని ఫాలో అయిపోవాలని నిర్ణయించుకున్నాను. `మజిలీ` నుంచి ఇది ఫాలో కావడం మొదలు పెట్టాను` అని తెలిపారు.
ఇక ఫ్యాన్స్ నా నుంచి చాలా ఎక్స్ పెక్ట్ చేస్తున్నారని, భారీ స్థాయిలో యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తే చూడాలని కోరుకుంటున్నారని.. ఆ కోరిక వెంకట్ ప్రభు మూవీతో నెరవేరుతుందని భావిస్తున్నానని చెప్పారు. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నానని, యాభై శాతం మూవీ అంతా ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా సాగుతుందని చెప్పుకొచ్చారు. చైతూ తన కెరీర్ పై చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పడు నెట్టింట వైరల్ గా మారాయి