Begin typing your search above and press return to search.
సామ్ తో విడిపోయినా హ్యాష్ ని మర్చిపోలేకపోతున్న చైతూ..!
By: Tupaki Desk | 8 July 2022 11:30 AM GMTఏడాది క్రితం వరకూ సౌత్ ఇండస్ట్రీలోని మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో ఒకరిగా అక్కినేని నాగ చైతన్య - సమంత జంట పేరు తెచ్చుకున్నారు. ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న చై సామ్.. విడిపోతున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు.
2017లో వివాహం చేసుకున్న చైతన్య - సమంత.. నాలుగేళ్ళ పాటు అన్యోన్యమైన దాంపత్య జీవితాన్ని గడిపారు. అయితే 2021 అక్టోబర్ లో సడన్ గా విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఎంతో ఆలోచించి పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఇది జరిగి తొమ్మిది నెలలు కావొస్తున్నా ఇప్పటికీ ఆ విషయాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియాలో ఏదొక సందర్భంలో వీరి విడాకులపై చర్చిస్తునే ఉన్నారు. అదే సమయంలో ఇద్దరి అభిమానులు ఒకరిపై ఒకరు ట్రోల్స్ చేసుకుంటూ వస్తున్నారు.
అయితే నాగచైతన్య ఇవేమీ పట్టించుకోకుండా పూర్తిగా కెరీర్ మీద దృష్టి పెట్టారు. ఎప్పటిలాగే సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. మరోవైపు సామ్ వరుస సినిమాలతో బిజీగా గడుపుతూనే.. ట్రోలర్స్ కు తగిన సమాధానాలు ఇస్తూ వస్తోంది.
విడాకుల ప్రకటన తర్వాత చై సామ్ పై మీడియా సోషల్ మీడియా ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. వాళ్ళు కఏ పోస్ట్ పెట్టినా క్షణాల్లోనే వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల నాగచైతన్య పెట్టిన ఓ పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది.
తన రాబోయే చిత్రం 'థాంక్యూ' ప్రమోషన్స్ లో భాగంగా చైతన్య తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో మూడు ఫోటోలను షేర్ చేస్తూ.. వీరు తన జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తులంటూ ధన్యవాదాలు తెలిపాడు.
చైతన్య తన అమ్మ లక్ష్మి దగ్గుబాటితో ఉన్న ఫోటోని పోస్ట్ చేస్తూ.. ఎప్పటికప్పుడు తనను రూట్ చేస్తున్నందుకు థాంక్స్ చెప్పారు. అలానే తన తండ్రి కింగ్ నాగార్జునతో ఉన్న ఫోటోను పంచుకున్న చై.. దిశానిర్దేశం చేస్తూ తన బెస్ట్ ఫ్రెండ్ గా ఉన్నందుకు థాంక్స్ చెప్పాడు.
చివరగా హాష్ కి కృతజ్ఞతలు తెలిపాడు చైతూ. తనకి ఫీల్ కలిగించినందుకు.. ఎలా ప్రేమించాలో చూపించినందుకు మరియు తనని మనిషిగా ఉంచినందుకు థాంక్స్ అంటూ రాసుకొచ్చాడు.
హ్యాష్ అనేది చై సామ్ భార్యాభర్తలుగా కలిసి ఉన్నప్పుడు పెంచుకున్న పెట్ డాగ్. ఇద్దరూ విడిపోయిన తర్వాత అది సమంతతో ఉంటోంది. దీనికి తోడుగా సాషా అనే మరో డాగ్ ను కూడా తీసుకొచ్చింది. గత ఏడాది చివర్లో హ్యాష్ మూడో పుట్టిన రోజును కూడా సామ్ సెలబ్రేట్ చేసుకుంది.
అయితే ఇప్పుడు నాగచైతన్య తన జీవితంలో కృతజ్ఞతలు చెప్పాల్సిన ముఖ్యమైన వారిలో హ్యాష్ కూడా ఉండటంతో.. పెట్ డాగ్ ని మాత్రం బాగా మిస్సవుతున్నాడని ఈ పోస్ట్ చూస్తే అర్థం అవుతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
అలానే మరికొందరు మాత్రం హ్యాష్ ని ప్రస్తావిస్తూ.. చైతూ సామ్ ని గుర్తు చేసుకుంటున్నాడని అంటున్నారు. పరోక్షంగా అతను తన మాజీ భార్యకు కృతజ్ఞతలు చెప్పి ఉండొచ్చని సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.
ఏదేమైనా చై సామ్ డివోర్స్ తీసుకోడాన్ని జీర్ణించుకోలేకపోతున్న ఫ్యాన్స్ మాత్రం.. ఈ పోస్ట్ చూసి కాస్త ఎమోషనల్ గా కామెంట్స్ పెడుతున్నారు. అన్నీ బాగా జరిగి మళ్లీ కలిసిపోవాలని కోరుకుంటున్నారు.
సమంత ఇటీవల ఓ నెటీజన్ కు కౌంటర్ ఇస్తూ.. విడాకులతో ప్రమేయం ఉన్న రెండు పార్టీలు స్పష్టంగా మూవ్ ఆన్ అయ్యాయి.. మీరు కూడా మూవ్ ఆన్ అవ్వండి అంటూ ట్వీట్ చేసింది. కొందరు మ్యూచువల్స్ మాత్రం వీరిద్దరూ ఎప్పటికైనా మళ్లీ కలవాలని ఆకాంక్షిస్తున్నారు.
ఇక 'థాంక్యూ' విషయానికొస్తే.. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నటించిన ఈ సినిమా రిలీజ్ కు రెడీ అయింది. జూలై 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇందులో రాశీ ఖన్నా - మాళవిక నాయర్ - అవికా గోర్ హీరోయిన్లుగా నటించారు. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి బీవీఎస్ రవి కథ అందించారు.
తన ఎదుగుదలకు తన ప్రతిభ మాత్రమే కారణమని విర్రవీగే ఓ యువకుడు.. తప్పు తెలుసుకుని తన సక్సెస్ లో భాగమైన వారందరినీ వెదుక్కుంటూ వెళ్లి కృతజ్ఞతలు చెప్పడమే 'థాంక్యూ' సినిమా కథాంశమని తెలుస్తోంది. దీనికి తగ్గట్లుగానే చైతూ తన రియల్ లైఫ్ లో భాగమైన ముగ్గురికి ధన్యవాదాలు తెలిపాడు.