Begin typing your search above and press return to search.
చైతూ కెరీర్ బెస్ట్ బిజినెస్?
By: Tupaki Desk | 13 March 2019 4:43 AM GMTఅక్కినేని నాగచైతన్య కెరీర్ ఒడిదుడుకుల గురించి తెలిసిందే. మాస్ హీరోగా తనని తాను ఆవిష్కరించుకోవాలని ప్రయత్నించిన ప్రతిసారీ ఫెయిలయ్యాడు. దడ- బెజవాడ- ఆటోనగర్ సూర్య- యుద్ధం శరణం- సవ్యసాచి .. ఇవన్నీ ఆ తరహా ప్రయత్నాలే. మాస్ యాక్షన్ ఎంచుకున్న ప్రతిసారీ సక్సెస్ కాలేదు. అయితే ప్రేమకథా చిత్రాలు, ఫ్యామిలీ కథాంశాల్ని ఎంపిక చేసుకున్న ప్రతిసారీ చైతూ సక్సెసయ్యాడు. ఏ మాయ చేశావే- ప్రేమమ్- రారండోయ్ వేడుక చూద్దాం లాంటి సినిమాల సక్సెస్ అందుకు ఎగ్జాంపుల్. తన బాడీ లాంగ్వేజ్ కి సూటయ్యే సినిమాలు ఇవని ప్రేక్షకులు ముద్ర వేశారు. అయితే ఈసారి వీటన్నిటికంటే భిన్నంగా చైతూ ఓ మధ్య తరగతి నేపథ్యం ఉన్న కథాంశాన్ని ఎంచుకున్నాడు. అందులోనే చక్కని ప్రేమకథ .. ఎమోషన్స్ నేపథ్యం ఉండేలా జాగ్రత్త పడ్డాడు. అందుకే `మజిలీ`కి సంబంధించిన ప్రతి అప్ డేట్ వేడెక్కిస్తోంది. నిన్ను కోరి లాంటి సెన్సిబిలిటీస్ ఉన్న సినిమా తీసిన శివ నిర్వాణ ఈ చిత్రాన్ని తీస్తుండడంతో ఆడియెన్ లోనూ ఆసక్తి పెరిగింది. మార్కెట్ వర్గాల్లో ఇది పాజిటివిటీ నింపిందని తెలుస్తోంది.
ఈ సినిమాకి రిలీజ్ ముందే 15 కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ రూపంలో నిర్మాతకు లాభాలు సాధ్యమైందని తెలుస్తోంది. థియేట్రికల్ హక్కులు, డబ్బింగ్- శాటిలైట్, డిజిటల్ రూపంలో భారీ మొత్తాన్ని షైన్ స్క్రీన్స్ సంస్థ ఆర్జించిందన్న సమాచారం అందుతోంది. ఈ సినిమా శాటిలైట్ హక్కుల్ని టాలీవుడ్ కి చెందిన ఓ ప్రయివేట్ ఎంటర్ టైన్మెంట్ చానెల్ 5కోట్లకు దక్కించుకుంది. 3.5 కోట్లకు అమెజాన్ డిజిటల్ హక్కుల్ని కొనుక్కుందని సమాచారం. హిందీ డబ్బింగ్ రైట్స్ రూపంలో మరో 4కోట్లు నిర్మాతకు దక్కింది. ఏప్రిల్ 5న ఈ సినిమా రిలీజవుతోంది.
ఇటీవలే రిలీజైన పాటలకు చక్కని స్పందన వచ్చింది. చైతన్య లుక్, పోస్టర్లలో చైతన్య - సమంత జోడీ మధ్య కెమిస్ట్రీ ప్రతిదీ క్యూరియాసిటీ పెంచాయి. ఇది ప్రీరిలీజ్ బిజినెస్ పరంగానూ కలిసొచ్చిందని చెబుతున్నారు. ఓవరాల్ గా 14-15 కోట్ల మేర ముందే లాభాలార్జించారని చెబుతున్నారు. చైతన్య - సమంత జంట పెళ్లి తర్వాత నటిస్తున్న సినిమా ఇది. ఎంపిక చేసుకున్న కథాంశంలో డెప్త్ ఉండడం వల్లనూ మార్కెట్ వర్గాల్లో క్రేజు నెలకొందని విశ్లేషిస్తున్నారు. సవ్యసాచి లాంటి ఫ్లాప్ తర్వాత చైతూ కంబ్యాక్ ఎలా ఉంటుందోనన్న ఆసక్తికర చర్చ సాగుతున్న వేళ.. మొత్తానికి చైతన్య తన కెరీర్ బెస్ట్ బిజినెస్ చేశాడు. దీనికి తగ్గట్టే బెస్ట్ హిట్ కొట్టి తీరాల్సిన సన్నివేశం ఉందిప్పుడు.