Begin typing your search above and press return to search.

చేసిన త్యాగాలు చాలనుకుంటున్న చైతూ

By:  Tupaki Desk   |   18 Aug 2016 8:54 AM GMT
చేసిన త్యాగాలు చాలనుకుంటున్న చైతూ
X
‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమా విషయంలో మ్యాగ్జిమం ఓపిక పట్టాడు అక్కినేని నాగచైతన్య. ఏడాది కిందట రావాల్సిన ఈ సినిమా ఎన్నిసార్లు వాయిదా పడిందో లెక్కపెట్టడం కష్టం. ఈ సినిమాను గౌతమ్ మీనన్ తెలుగు-తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కించాడు. తమిళ వెర్షన్ కు శింబును హీరోగా పెట్టుకోవడం శాపమైంది. అతడి వివాదాల పుణ్యమా అని సినిమా షూటింగ్ సజావుగా సాగలేదు. చైతూ డేట్లు చాలా వృథా అయ్యాయి.

ఐతే గౌతమ్ మీనన్ ‘ఏమాయ చేసావె’తో తనకు తొలి విజయాన్నందించాడన్న అభిమానంతో ఎంతో ఓపిక పట్టాడు చైతూ. కానీ ఎంతకీ సినిమా సంగతి తేలలేదు. ఈ సినిమా విడుదలయ్యాక ‘ప్రేమమ్’ను విడుదల చేద్దామని వెయిట్ చేశాడు. ఎంతకూ ‘సాహసం..’ సంగతి తేల్చకపోవడంతో ‘ప్రేమమ్’ను ముందు రిలీజ్ చేసేద్దామని ఫిక్సయితే.. పోటీగా అదే రోజుకు గౌతమ్ రిలీజ్ ప్లాన్ చేయడం చైతూకు మంట పుట్టించింది. దీంతో ఇప్పటిదాకా ‘సాహసం..’ కోసం చేసిన సాహసాలు చాలని భావిస్తున్నాడు చైతూ.

ఓపిక నశించిన చైతూ.. ‘సాహసం..’ సంగతి వదిలేసి ‘ప్రేమమ్’ మీదే దృష్టిపెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రోజులు ‘ప్రేమమ్’లోని ఓ పాటను రిలీజ్ చేశాడు చైతూ. ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెంటుగా ఉన్న చైతూ.. దీన్ని బాగా ప్రమోట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. గౌతమ్ రాజీకి రాకుంటే ‘ప్రేమమ్’ యధావిధిగా సెప్టెంబరు 9న రిలీజయ్యేలా చూడాలని చైతూ భావిస్తున్నాడు. మరి ఈ లోపు గౌతమ్ తో ఏదైనా అండర్ స్టాండింగ్ జరుగుతుందేమో చూద్దాం.