Begin typing your search above and press return to search.

అల్లుడు వాయిదా - నాగ శౌర్య లక్కీ!

By:  Tupaki Desk   |   20 Aug 2018 10:43 PM IST
అల్లుడు వాయిదా - నాగ శౌర్య లక్కీ!
X
ఇప్పటికే 'అల్లుడిమీద కేరళ వరదల ఎఫెక్ట్' అంటూ మన తుపాకీలోనే ఒక ఆర్టికల్ వచ్చింది... సారాంశం ఏంటంటే "కేరళ వరదల కారణంగా 'శైలజారెడ్డి అల్లుడు' సినిమా పోస్ట్ ప్రొడక్షన్ డిలే అవుతోందని దాని వల్ల సినిమాను సెప్టెంబర్ 4 న రిలీజ్ చేసే ప్లానింగ్ లో మేకర్స్ ఉన్నారని."

ఇప్పుడు 'శైలజారెడ్డి అల్లుడు హీరో నాగ చైతన్య ఫేస్ బుక్ ద్వారా సినిమా సినిమా వాయిదా పడిందనే విషయాన్ని వెల్లడించాడు. చైతు తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా ఇలా పోస్ట్ పెట్టాడు. "కేరళ లో నెలకొన్న దురదృష్టకర పరిస్థితుల కారణంగా 'శైలజా రెడ్డి అల్లుడు' టీం కేరళ లో జరుగుతున్న రీ-రికార్డింగ్ ను పూర్తి చేయలేకపోయింది. దాంతో మిగిలి ఉన్న పోస్ట్ ప్రొడక్షన్ పై కూడా ఆ ఇంపాక్ట్ పడింది. దీంతో నిర్మాతలు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించాల్సిన అవసరం ఏర్పడింది. త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ ను వారు ప్రకటిస్తారు. దీనివల్ల జరిగే ఆలస్యానికి నేను సిన్సియర్ గా క్షమాపణ కోరుకుంటున్నాను. అందరినీ కేరళ ప్రజలకు ఈ ఇబ్బందికరమైన పరిస్థితిలో వారికి అవసరమైన సహాయాన్ని చేయవలసిందిగా కోరుతున్నాను. అక్కడ ఇబ్బంది పడే ప్రతి ఒక్కరి కోసం నా హృదయ ద్రవిస్తోంది. త్వరలో అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొనాలని ప్రార్థన చేస్తున్నాను."

దీంతో ఆగష్టు 31 న విడుదల కావల్సిన 'శైలజా రెడ్డి అల్లుడు' వాయిదా కన్ఫాం అయినట్టే. మరోవైపు ఈ సినిమా వాయిదాతో నాగశౌర్య తాజా చిత్రం '@నర్తనశాల' కు లైన్ పూర్తిగా క్లియర్ అయినట్టే. చైతు సినిమాతో పోటీ లేకుండా శౌర్య ఒక్కడే బాక్స్ ఆఫీస్ ను దున్నుకోవచ్చన్నమాట.