Begin typing your search above and press return to search.
మారుతీ స్పీడ్ కి చైతు బ్రేక్
By: Tupaki Desk | 19 Jun 2018 5:30 PM GMTసినిమాలు వేగంగా తీయటంలో దర్శకుడు మారుతిది ప్రత్యేకమైన స్టైల్. ఇప్పుడున్న యూత్ హీరోల్లో స్పీడ్ గా సినిమాలు చేస్తున్న వాళ్లలో చైతుదే ఫస్ట్ ప్లేస్. ఈ ఇద్దరి కాంబో అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా. శైలజా రెడ్డి అల్లుడు అనౌన్స్ చేసినప్పుడు అందరూ అనుకున్నది ఇదే. జెట్ స్పీడ్ తో షూటింగ్ ఫినిష్ అయిపోయి త్వరగా విడుదలవుతుంది అనుకోవడం సహజం. కానీ జరుగుతున్నది వేరని వినికిడి . డేట్స్ ఇస్తే తాను అనుకున్న టైం కన్నా ముందే ఫస్ట్ కాపీ చేతిలో పెట్టే మారుతీ వేగం పసిగట్టే చైతు కావాలని స్లో చేస్తున్నాడని ఇన్ సైడ్ టాక్.
వారానికి ఒకటి రెండు రోజలు డేట్లు ఇస్తూ మిగిలిన సమయంలో ఇతర ప్రాజెక్ట్స్ తో పాటు సవ్యసాచి మీద దృష్టి పెడుతున్నాడట. గ్రాఫిక్ వర్క్ వల్ల కొంత ఆలస్యమవుతున్న సవ్యసాచి మీదే చైతు ఫోకస్ ఎక్కువగా ఉంది . మాధవన్ కు సంబంధించిన ఒక్క కీలకమైన సీన్ తప్ప షూటింగ్ మొత్తం ఏనాడో పూర్తయిన సవ్యసాచి పోస్ట్ ప్రొడక్షన్ క్వాలిటీ విషయంలో రాజీ పడకపోవడం వల్ల ఆలస్యం అవుతోంది. ఒక చేయి తన ఆధీనంలో ఉండని సరికొత్త పాత్ర చేసిన చైతు సవ్యసాచి మీద ప్రత్యేక శ్రద్ధ ఉండటం సహజం.శైలజారెడ్డి అల్లుడు రెగ్యులర్ కమర్షియల్ ఫిలిం. కానీ సవ్యసాచి డిఫరెంట్ జానర్ కిందకు వస్తుంది . అందుకే అది విడుదల అయ్యే దాకా శైలజా రెడ్డి వాయు వేగంతో వెళ్లకుండా చైతునే చాలా ప్లాన్డ్ గా స్లో అయ్యాడని ఫిలిం నగర్ గుసగుస.
ఇందులో అబద్దం అనడానికి ఏమి లేదు. ఎందుకంటే మహానుభావుడు తర్వాత చెప్పుకోదగ్గ గ్యాప్ తీసుకున్న మారుతో శైలజారెడ్డి అల్లుడు స్క్రిప్ట్ మీద పూర్తిగా వర్క్ చేసాడు. షూటింగ్ కూడా పక్కా ప్లానింగ్ తోనే మొదలుపెట్టాడు. చైతు కనక నిజంగా సహకరిస్తే గ్రాఫిక్స్ హంగామా అవసరం లేని ఈ సినిమాని మూడు నెలల్లో పూర్తి చేసినా ఆశ్చర్యం లేదు. అందుకే కాబోలు చైతు చాలా తెలివిగా ఇన్ డైరెక్ట్ గా లేట్ చేయిస్తున్నాడు అనే కామెంట్ కి బలం చేకూరుతోంది. అత్తయ్యగా రమ్య కృష్ణ నటిస్తున్న ఈ మూవీలో అను ఇమ్మానియేల్ హీరోయిన్. తమన్ స్వరాలూ సమకూరుస్తున్నాడు. నాగార్జునకు 90వ దశకంలో ఎవర్ గ్రీన్ ఎంటర్ టైనింగ్ హిట్ గా నిలిచిపోయిన అల్లరి అల్లుడు తరహాలో ఇది చైతుకు పెద్ద బ్రేక్ అవుతుందని ఫ్యాన్స్ బోలెడు అంచనాలు పెట్టేసుకున్నారు. దానికి తగ్గట్టే అందులో సూపర్ హిట్ సాంగ్ నిన్ను రోడ్డు మీద చూసినది లగాయిత్తు శైలజారెడ్డి అల్లుడు కోసం రీమిక్స్ చేయటం దానికి ఊతమిస్తోంది. సవ్యసాచి విడుదలను బట్టే శైలజారెడ్డి అల్లుడు రిలీజ్ డేట్ ఆధారపడి ఉంటుంది. అప్పటిదాకా సస్పెన్స్ తప్పదు.