Begin typing your search above and press return to search.

సోగ్గాడే చిన్ని నాయనా టచ్ అదిరిపోయింది

By:  Tupaki Desk   |   7 Oct 2016 5:10 PM GMT
సోగ్గాడే చిన్ని నాయనా టచ్ అదిరిపోయింది
X
మలయాళం ప్రేమమ్ చూసినోళ్లందరికీ.. ఘాటుగా తగిలే మలయాళ వాసన ఏంటంటే.. ఆ సినిమాలో హీరో ఎక్కువశాతం లుంగీల్లో కనిపిస్తాడు. అక్కడ జనాలు కాలేజీలకు కూడా అలాగే వచ్చేస్తారులే. కాకపోతే ఆ సినిమాను తెలుగులో చేస్తున్నప్పుడు మన దగ్గర అలా లుంగీలు కట్టించి కాలేజీలకు పంపడం అనేది బాగుండదు. అందుకే పూర్తిగా లుంగీని దూరం చేశాడు నాగ చైతన్య.

కాకపోతే తెలుగు 'ప్రేమమ్'లో మాత్రం ఒక్క సీన్లో చైతూ అండ్ బ్యాచ్ లుంగీల్లో దర్శనమిస్తారు. కాకపోతే అక్కడ వేసిన లుంగీకి ఏమని సమాధానం చెప్తారు మరి? ఎలా జస్టిఫై చేస్తారు? అందుకోసమే ఒక పర్ఫెక్ట్ టచ్ ఇచ్చాడు దర్శకుడు చందు మొండేటి. అసలు ఈ లుక్ లో మనం ఎందుకు ఉన్నామురా అని హీరో అడిగితే.. ఇప్పుడు లేటెస్టు ట్రెండ్ ఇదే.. సోగ్గాడే చిన్ని నాయనా స్టయిల్ ఇది.. వాసివాడి తస్సాదియ్యా.. అంటూ డైలాగులు పలికించాడు. ఆ దెబ్బకి ధియేటర్ ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది.

అప్పట్లోనే కింగ్ నాగార్జునతో కలసి.. సోగ్గాడే చిన్ని నాయనా ప్రమోషన్లకు సేమ్ టు సేమ్ బంగార్రాజు గెటప్స్ లో వచ్చి అలరించారు నాగ చైతన్య అండ్ అఖిల్. ఇప్పుడు సినిమాలోపల కూడా చైతన్య అదే గెటప్ తో అదరగొట్టేశాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/