Begin typing your search above and press return to search.
పేరు అఖిల్.. ఇంకేం ర్యాగింగ్ చేస్తాం
By: Tupaki Desk | 11 Oct 2016 4:11 AM GMTఅక్కినేని బ్రదర్స్ గా రానున్నా కాలానికి నాగచైతన్య అండ్ అఖిల్ మాంచి ఎగ్జాంపుల్ గా నిలువడం ఖాయం. ఇద్దరూ పరస్పరం ఒకరి ఫంక్షన్లకు ఒకరు రావడమే కాదు.. అసలు ఒకరి గురించి ఒకరు చెబుతున్నప్పుడు కూడా మనకు అనువణువూ ఆ ప్రేమానురాగాలు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ''ప్రేమమ్'' సినిమాలో కూడా అసలు అలాంటి సీన్ ఒకటి పెట్టడం హైలైట్.
కాలేజీలో ఫ్రెషర్లను ర్యాగింగ్ చేస్తుంటారు విక్రమ్ (నాగ చైతన్య) అండ్ గ్యాంగ్.. అప్పుడే అక్కడకు ఒకబ్బాయి వస్తాడు. పేరేంటమ్మా అనగానే.. 'అఖిల్' అంటాడు. 'ఇంకేం ర్యాగింగ్ చేస్తాం' అంటూ హీరో అతడ్ని అక్కడినుండి పంపించేస్తాడు. ఆ ఒక్క ఎపిసోడ్ చాలు.. అసలు నాగచైతన్యకు అఖిల్ అంటే ఎంత లవ్ ఉందో. అదే విధంగా అఖిల్ కూడా చాలాసార్లు ఎన్నో ఫంక్షన్లలో అన్నయ్య మీద ప్రేమను కురిపించాడు. ఇక ట్వీట్లతో అయితే చెప్పక్కర్లేదు.
అయితే ఇప్పుడు అందరూ చూడాలని అనుకునేది ఒకటే. అసలు చైతూ అండ్ అఖిల్ ఒక సినిమాలో కలసి నటిస్తే బాగుంటుంది కదూ? చూద్దాం మరి జనాలను ఎక్కువ కాలం ర్యాగింగ్ చేయకుండా వీరు త్వరగా ఆ సినిమా చేసేస్తారేమో.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/