Begin typing your search above and press return to search.

అవినీతి అసిస్టెంట్ పై చైతు వేటేశాడు

By:  Tupaki Desk   |   15 Feb 2016 5:45 AM GMT
అవినీతి అసిస్టెంట్ పై చైతు వేటేశాడు
X
అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం మజ్ను మూవీ షూటింగ్ కోసం గోవాలో ఉన్నాడు. మలయాళ బ్లాక్ బస్టర్ ప్రేమమ్ కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం.. ఇప్పటికే వైజాగ్ లో షూటింగ్ చేశారు. విశాఖలోని ఓ ప్రైవేట్ కాలేజ్ లో కీలక సన్నివేశాలను తెరకెక్కించింది మజ్ను యూనిట్. అయితే.. ఇక్కడ జరిగిన ఓ ఇన్సిడెంట్ గురించి తెలిసిన చైతు.. తన అసిస్టెంట్ ని నిర్దాక్షిణ్యంగా తొలగించేశాడట.

చైతు-శృతిహాసన్ ల మధ్య వచ్చే కీలక సన్నివేశాల కోసం వైజాగ్ లోని కాలేజ్ లో షూటింగ్ జరిపారు. ఇందుకోసం ఆ కాలేజ్ యాజమాన్యం స్వచ్ఛందంగానే ముందుకొచ్చింది. అయితే.. ఆ సమయంలో చైతూతో కలిసి ఫోటోలు దిగాలని తమ విద్యార్ధులు కోరుకుంటున్నారని.. నాగచైతన్య అసిస్టెంట్ వేణుని ప్రిన్సిపాల్ కోరాడట. అయితే ఇలా చైతూతో ఫోటోలు అందరు విద్యార్ధులు దిగేందుకు గాను.. 10 లక్షలు ఖర్చవుతుందని చెప్పాడట వేణు.

అప్పటికి సైలెంట్ గా ఉన్న ప్రిన్సిపాల్.. తర్వాత ఓ సమయంలో చైతును కలిసినపుడు ఈ విషయం అతని దృష్టికి తెచ్చాడు. ఈ విషయం విని షాక్ తిన్న నాగచైతన్య.. వెంటనే వేణును విధుల్లోంచి తొలగించేశాడు. ఈ సంగతి తెలిసి, అన్నపూర్ణ స్టూడియోస్ లో చాలామంది ఉద్యోగులు సంతోషించడమే కాదు.. ఏకంగా టపాసులు కూడా కాల్చారు. అతను ఏ రేంజ్ లో అవినీతి, వేధింపులకు పాల్పడతాడో.. అక్కినేని హీరోకి అప్పటికి అర్ధమైందని చెప్పుకుంటున్నారు.