Begin typing your search above and press return to search.

పారితోషికం పెంచేంత సాధించాడా?

By:  Tupaki Desk   |   11 Feb 2020 11:30 PM GMT
పారితోషికం పెంచేంత సాధించాడా?
X
యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య కెరీర్ బ్యాక్ టు బ్యాక్ స‌క్సెస్ ల‌తో ఇటీవ‌ల‌ స్పీడందుకుంది. మ‌జిలీ.. వెంకీమామ‌తో వ‌రుస‌ సక్సెస్ లు అందుకుని రేసులో నిల‌బ‌డ్డాడు. సినిమాల ప‌రంగా జోరు కూడా పెంచాడు. ప్ర‌స్తుతం శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో `ల‌వ్ స్టోరీ`లో న‌టిస్తున్నాడు. యూత్ లో చైతూకి ఉన్న క్రేజ్.. ల‌వ్ స్టోరీలు తెర‌కెక్కించ‌డంలో శేఖ‌ర్ క‌మ్ములా మార్క్ ఈ చిత్రానికి క‌లిసి రానుంది. దీంతో భారీ అంచ‌నాల మ‌ధ్యే సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక చైతూ త‌న 20వ చిత్రాన్ని `గీత గోవిందం` ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ తో చేస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉంది. గీతగోవిందం త‌ర్వాత ప‌రశురాం తెర‌కెక్కిస్తున్న సినిమా కావ‌డంతో అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ ను 14 రీల్స్ ప్ల‌స్ సంస్థ‌ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని నిర్మిస్తోంది. ఈ నేప‌థ్యంలో చైతూ పారితోషికం పెంచాడ‌ని ప్ర‌చార‌మ‌వుతోంది.

రెండు వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్ల త‌ర్వాత చేస్తున్న సినిమా కాబ‌ట్టి .. 14 రీల్స్ ప్ల‌స్ సినిమాకు నాగ‌చైత‌న్య 8 కోట్లు ఛార్జ్ చేస్తున్నాడుట‌. అయితే మ‌జిలీ ముందు వ‌ర‌కూ సీన్ వేరే. అప్ప‌ట్లో 5 -6 కోట్ల మ‌ధ్య‌లో పారితోషికం అదుకునేవాడు. కానీ వ‌రుస‌ స‌క్సెస్ ల నేప‌థ్యంలో అద‌నంగా 2 కోట్లు పెంచాడ‌ట‌. 14 రీల్స్ ప్ల‌స్ అడ్వాన్స్ గా కొంత మొత్తం చెల్లించింద‌ని స‌మాచారం. అలాగే చైతూ సినిమాకి ప‌రశురాం కూడా పారితోషికం పెంచేశాడ‌ట‌. గీత గోవిందం ఎఫెక్టుతో అత‌డి డిమాండ్ పెద్ద‌గానే ఉంద‌ని చెబుతున్నారు.

గీత‌గోవిందం వంద కోట్ల క్ల‌బ్ లో చేర‌డంతో ప‌రుశురాం రెమ్యున‌రేషన్ 10 కోట్లు అయ్యింది అని ఇప్ప‌టికే ప్ర‌చారంలో ఉంది. అలా చూసుకుంటే చై-ప‌రుశురాం పారితోషికాల‌కే 18 కోట్లు అవుతుంది. ఒక‌ప్పుడు వీళ్లిద్ద‌రి సినిమాలు 10 - 20 కోట్ల బ‌డ్జెట్ లో పూర్త‌య్యేవి. కానీ ఇప్పుడా బ‌డ్జెట్ కేవ‌లం పారితోషికాల‌కే ఖ‌ర్చు అవుతోంది. దీంతో కేవ‌లం సినిమా నిర్మాణానికి 15 కోట్ల‌కు పైగానే పెట్టాలి. అంటే ఇప్పుడు చైతో సినిమాలు చేయాలంటే 30 నుంచి 35 కోట్ల మేర నిర్మాత‌లు రెడీ చేసుకోవాల్సిన స‌న్నివేశం ఉంద‌ని చెబుతున్నారు. హీరోల రేంజు పెరిగితే మంచిదే కానీ.. అది నిర్మాత‌కు బొప్పి క‌ట్టించేదిగా మారితేనే స‌మ‌స్య‌. దీనిపై దాస‌రి వంటి వాళ్లు ఓ రేంజులై ఫైరైపోయేవారు. కానీ ఇప్పుడు ఆ కండీష‌న్స్ ఏవీ లేవు.