Begin typing your search above and press return to search.
క్రేజీ... డీజే టిల్లు నాగ చైతన్య
By: Tupaki Desk | 8 Jun 2022 12:30 AM GMTసిద్దు జొన్నలగడ్డ నటించిన డీజే టిల్లు ఈమద్య కాలంలో ఎంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డీజే టిల్లు సక్సెస్ అయినా కూడా దర్శకుడు విమల్ కృష్ణ పేరు మాత్రం ఎక్కువగా ఫోకస్ అవ్వలేదు. స్క్రిప్ట్ కూడా సిద్దు చేశాడంటూ మొత్తం సక్సెస్ క్రెడిట్ ను ఆయనకే ఇవ్వడం జరిగింది. దర్శకుడి పేరు కూడా చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఆ దర్శకుడు నాగ చైతన్య తో సినిమాకు రెడీ అయ్యాడు.
ఎంత కాదన్నా ఖచ్చితంగా డీజే టిల్లు విజయంలో దర్శకుడు విమల్ కృష్ణ క్రెడిట్ ఉంటుంది. ఆయనకు జనాల్లో గుర్తింపు రాకున్నా కూడా ఇండస్ట్రీ వర్గాల వారు ఆయన ప్రతిభకు గుర్తింపు గౌరవం ఇస్తారు. డీజే టిల్లు దర్శకుడిగా ఆయనకు ఇండస్ట్రీలో గుర్తింపు అయితే దక్కింది. అందుకే ఆయన కథ చెప్తే వినేందుకు చాలా మంది యంగ్ హీరోలు సిద్దంగా ఉన్నారు అనడంలో సందేహం లేదు.
డీజే టిల్లు సినిమా సీక్వెల్ లో తాను పార్ట్ అవ్వబోవడం లేదు అంటూ తేల్చి చెప్పిన దర్శకుడు విమల్ కృష్ణ ఇటీవల నాగ చైతన్య కు కథ వినిపించి ఓకే చెప్పించుకున్నాడని సమాచారం అందుతోంది. వీరిద్దరి కాంబోలో ఒక యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ మూవీ రాబోతుందనే వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం నాగ చైతన్య కు ఉన్న కమిట్‌మెంట్స్ పూర్తి అయిన తర్వాత కాని డీజే టిల్లు డైరెక్టర్ తో జోడీ కట్టబోతున్నాడు. థ్యాంక్యూ సినిమా ఇప్పటికే విడుదలకు సిద్దంగా ఉంది. మరో వైపు వెబ్ సిరీస్ లో కూడా నటించి త్వరలోనే అమెజాన్ ద్వారా ఆ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
హీరోగా చైతూ కు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. కనుక దర్శకుడు విమల్ కృష్ణ మరో మంచి యూత్ ఫుల్ సబ్జెక్ట్ ను ఎంపిక చేసుకుంటే ఖచ్చితంగా మంచి విజయాన్ని సొంతం చేసుకోవచ్చు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.