Begin typing your search above and press return to search.
చైతూ మొహమాటానికి ఇదే సాక్ష్యం
By: Tupaki Desk | 3 Oct 2021 3:30 PM GMTనాగచైతన్య.. సాయి పల్లవిల లవ్ స్టోరీ సినిమాకు మంచి స్పందన వచ్చింది. నాగ చైతన్య గతంలో ఎప్పుడు కనిపించని వైవిధ్యభరిత పాత్రలో కనిపించాడు. ఈ సినిమాలో నటుడిగా చైతూ మరో స్థాయికి చేరాడు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో చైతూ కెరీర్ బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ను ఇచ్చింది. ముఖ్యంగా సాయి పల్లవి ముద్దు పెట్టిన సమయంలో ఎమోషనల్ అయిన సన్నివేశం నిజంగా ఆకట్టుకుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. చాలా నాచురల్ గా చైతూ ఆ సన్నివేశాల్లో నటించాడు. అయితే ఆ సన్నివేశాల కోసం చాలా కష్టపడ్డారని.. చైతూ మొహమాటం కారణంగా ఆ సన్నివేశాల్లో నాచురాలిటీ వచ్చేలా తీసేందుకు చాలా కష్టపడ్డారట. ఈ విషయాన్ని తాజాగా చిత్ర యూనిట్ సభ్యులు చెప్పుకొచ్చారు.
హీరోయిన్ ముద్దు పెట్టిన సమయంలో చైతూ ఎమోషనల్ అవ్వాల్సి ఉంటుంది. కాని చైతూ మొహమాటంతో చాలా టేక్ లు తీసుకున్నాడట. చైతూ మొహమాట పడటం.. మళ్లీ ఆ షాట్ ను మళ్లీ చేయాల్సి రావడం జరిగిందట. చైతూ మరియు సాయి పల్లవిలతో ఆ సన్నివేశంను ఏకంగా ఆరు గంటల పాటు చిత్రీకరించారట. శేఖర్ కమ్ముల ఫర్ఫెక్షన్ కోసం చాలా సార్లు టేక్ చేయాల్సి వచ్చిందట. చైతూ మొహమాటం కు ఇదే ప్రత్యక్ష సాక్ష్యం అన్నట్లుగా యూనిట్ సభ్యులు చెబుతున్నారు. తన వ్యక్తిగత విషయాలను బయటకు చెప్పేందుకు మరియు ఇతర విషయాలను బాహాటంగా షేర్ చేసుకునేందుకు కూడా నాగ చైతన్య చాలా మొహమాటపడేవాడు. అలాంటి సన్నివేశాలను ఇప్పటి వరకు చైతూ అందుకే చేయలేదు.
సమంతతో కూడా గతంలో ఎప్పుడు అలాంటి సన్నివేశాల్లో చైతూ నటించలేదు. మనంలో కాస్త ఘాటు రొమాన్స్ చేసినా కూడా ముద్దు సీన్స్ మాత్రం లేదు. అప్పుడు కూడా మొహమాటంతోనే చైతూ ఆ సన్నివేశాలు లేకుండా చూశాడేమో అంటున్నారు. మొత్తానికి చైతూ మొహమాటస్తుడు అని లవ్ స్టోరీ సినిమా లోని ఆసన్నివేశంతో తేలిపోయింది. అలాంటి మొహమాటస్తుడు అయిన నాగచైతన్య ఇప్పడు తన భార్య సమంత నుండి విడిపోయిన తర్వాత మీడియాను ఫేస్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో అభిమానులతో కూడా మొహమాటంతోనే చైతూన్య ఇంట్రాక్ట్ అయ్యేందుకు ఆసక్తి చూపించడని కొందరు అంటున్నారు.