Begin typing your search above and press return to search.

చైతూ మీద స‌మంత ఎఫెక్ట్ ఎంత‌?

By:  Tupaki Desk   |   24 May 2017 4:42 AM GMT
చైతూ మీద స‌మంత ఎఫెక్ట్ ఎంత‌?
X
సినిమా ఇండ‌స్ట్రీలో ఉన్నోళ్ల మ‌ధ్య న‌డిచే ప్రేమ‌క‌థ‌ల గురించి తెలియ‌ని వారే ఉండ‌రు. అయితే.. వీరికి కాస్త భిన్నంగా ఉంది నాగ‌చైత‌న్య‌.. స‌మంత ల‌వ్ ట్రాక్‌. వీరి వ్య‌వ‌హారం బ‌య‌ట‌కు రాక ముందే.. ఇరు కుటుంబాలు మాట్లాడేసుకోవ‌టం.. పెళ్లి చేయాల‌ని డిసైడ్ కావ‌టం.. ఓపెన్ గా చెప్పేయ‌టం.. గ్రాండ్ గా ఎంగేజ్ మెంట్ పూర్తి చేసేసి.. పెళ్లికి కాస్త టైం తీసుకున్న ఈ ల‌వ్ బ‌ర్డ్స్ బాగానే ఎంజాయ్ చేస్తున్నారు.

ఈ ల‌వ్ ట్రాక్ స‌మంత మీద ఎంత ప్ర‌భావం చూపించింద‌న్న విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. నాగ‌చైత‌న్య మీద ఎంత‌గా ఉంద‌న్న విష‌యాన్ని ఆయ‌న తండ్రి నాగార్జున చెప్పుకొచ్చారు. ఒక మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌నీ ఆస‌క్తిక‌ర విష‌యాల్ని చెప్పుకొచ్చారు. చై తాజాగా న‌టించిన రారండోయ్ వేడుక చూద్దాం చిత్రంలో ఈజ్ బాగా క‌నిపించింద‌ని.. అదంతా స‌మంత ఎఫెక్ట్ అని నాగ్ చెప్ప‌టం విశేషం.

చైతూలో గ‌తంలో కంటే ఎక్కువ ఈజ్ క‌నిపిస్తోంద‌ని.. మ‌నిషి చాలా రిలీఫ్‌ అయిపోయాడ‌ని.. ఎప్పుడూ సంతోషంగా క‌నిపిస్తున్నాడ‌ని నాగ్ చెప్పారు. అదంతా స‌మంత ఎఫెక్ట్ ఏమో అంటూ న‌వ్వుతూ చెప్పుకొచ్చారు. మ‌నం సినిమాలో స‌మంత బాగా క్లోజ్ అయిపోయింద‌ని.. సార్‌.. సార్ అని పిలిచేద‌ని చెప్పారు.

సార్ ఏంటి? మామా అని పిలు.. అని బ‌ల‌వంతంగా పిలిపించుకుంటున్నాన‌ని.. మామ‌య్య అంటే వ‌య‌సు అయిపోయింద‌న్న ఫీలింగ్ క‌లుగుతుంద‌న్నారు నాగ్‌. మొత్తానికి కొడుకు సంతోషం గుట్టు విష‌యాన్నే కాదు.. త‌న‌ను మ‌ధ్య‌వ‌య‌స్కుడిగా అంద‌రూ చూడాల‌న్న ఫీలింగ్ త‌న‌లో ఎంత ఉంద‌న్న విష‌యాన్ని నాగ్ చెప్ప‌క‌నే చెప్పేసిన‌ట్లు లేదు?