Begin typing your search above and press return to search.

అల్లుడి దెబ్బకు చైతు అలెర్ట్!!

By:  Tupaki Desk   |   22 Sep 2018 6:38 AM GMT
అల్లుడి దెబ్బకు చైతు అలెర్ట్!!
X
మాస్ సినిమాని కొందరు చాలా తేలిగ్గా తీసిపారేస్తారు కానీ కమర్షియల్ లెక్కలను బాలన్స్ చేయటం అంత ఈజీ కాదు. అందుకే ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ అయినా స్క్రిప్ట్ విషయంలో ఏ చిన్న పొరపాటు చేసినా దానికి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. గత ఏడాది బోయపాటి శీను జయ జానకి నాయక ఈ సంవత్సరం వివి వినాయక్ ఇంటెలిజెంట్ లను దీనికి మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మారుతీ బహుశా ఈ సూత్రాన్ని పూర్తిగా వంటబట్టించుకోకుండా చైతుని మాస్ హీరోగా ప్రొజెక్ట్ చేసే క్రమంలో కథను లైట్ గా తీసుకోవడం బాక్స్ ఆఫీస్ దగ్గర శైలజారెడ్డి అల్లుడు ఫలితాన్ని శాసిస్తోంది. మొదటి మూడు రోజులు మంచి దూకుడు మీద కనిపించిన అల్లుడు సోమవారం నుంచి ఊహించిన దాని కన్నా తక్కువ స్థాయిలో డ్రాప్స్ రికార్డు చేయడంతో ఈజీగా 30 కోట్ల షేర్ అందుకుంటుందన్న అభిమానుల ఆశలు ఆవిరైపోయాయి. పాతిక కోట్ల షేర్ దాటితే చాలు అనుకునేలా ఉంది పరిస్థితి. ఇది అక్కినేని ఫ్యామిలీ ఊహించనిది. నిజానికి ప్రీ రిలీజ్ లో నాగ్ తో సహా అందరు దీని మీద ఎంతో నమ్మకం వ్యక్తం చేసారు.

కానీ జరిగింది వేరు. ఏదో ఒక శారీరక లేదా మానసిక జబ్బులతో క్యారెక్టర్లు రాసుకుని ఆ తర్వాత కథను అల్లుకుంటున్న మారుతీ అంచనాలు మొత్తంగా బోల్తా కొట్టాయి. అత్తా అల్లుళ్ళ ఫార్ములా అవుట్ డేటెడ్ అయినా సరైన రీతిలో మెప్పించేలా తీస్తే ఆదరించడానికి మాస్ ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. అంతే తప్ప పొగరున్న తల్లి కూతుళ్ళకు నాన్నను తోడు చేసి మధ్యలో హీరో నలిగిపోయేలా కథను రాసుకుంటే సరిపోదు. డ్రామా పండాలి.కామెడీ గురించి మళ్ళి మళ్ళి చెప్పుకునేలా ఉండాలి. కానీ అవన్నీ అల్లుడు లో మిస్ కావడంతో కాస్ట్ ఫెయిల్యూర్ కాకుండా ఆపడం కష్టంగానే ఉంది. చైతు పాత్రకు సూట్ కాలేదనే కంప్లైంట్ లేదు. శైలజారెడ్డి అల్లుడిగా బాగా ఒదిగిపోయాడు. కానీ కథనంలో బలం లేకపోవడంతో అల్లుడు నేర్పిన పాఠం చైతుని అలెర్ట్ అయ్యేలా చేస్తోంది. ఒక యావరేజ్ లేదా ఫెయిల్యూర్ తర్వాత సినిమాల మీద కొంత ప్రభావం చూపవచ్చేమో కానీ స్టార్ హీరోల విషయంలో పూర్తిగా ఉండదు. ఈ నేపధ్యంలో డిఫరెంట్ జానర్ లో కొత్తగా ట్రై చేస్తున్న సవ్యసాచి మీదకు చైతు తన ఆశలన్నీ షిఫ్ట్ చేసాడు. ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్యారీ చేస్తున్న సవ్యసాచి కనక హిట్ అయితే అల్లుడు చేసిన గాయాలు త్వరగానే మాసిపోతాయి. అది తేలాలంటే నవంబర్ దాకా ఆగాలి.