Begin typing your search above and press return to search.

కొత్త పిల్లకీ లిప్ లాక్ సెట్ చేశాడా?

By:  Tupaki Desk   |   24 Oct 2015 3:52 AM GMT
కొత్త పిల్లకీ లిప్ లాక్ సెట్ చేశాడా?
X
ఏం మాయ చేశావే.. ఈ పేరు వినగానే నాగ చైతన్య - సమంత లిప్ లాక్ సన్నివేశాలు గుర్తుకొచ్చేస్తాయి. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వీళ్లిద్దరి మధ్యా రొమాంటిక్ సన్నివేశాలు అద్భుతంగా పండాయి. వీటికి ముద్దు సన్నివేశాలు మరింతగా ఆకర్షణ జోడించాయి. ఆ తర్వాత కూడా సమంత - చైతూలు కలిసి నటించిన ప్రతీ సినిమాలోనూ ఇవి కామన్ అయిపోయాయి.

ఇప్పుడు మరోసారి గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో నటిస్తున్నాడు చెర్రీ. ఈ మూవీ పేరు సాహసం శ్వాసగా సాగిపో. ఇందులో హీరోయిన్ గా మళయాళీ భామ మంజిమా మోహన్ నటిస్తోంది. ఇది కూడా రొమాంటిక్ లవ్ స్టోరీయే కావడంతో.. రొమాంటిక్ సన్నివేశాలు పుష్కలంగా ఉన్నాయని తెలుస్తోంది.

అసలే రొమాన్స్.. అందులోనూ గౌతమ్ మీనన్, నాగ చైతన్యలకు లిప్ టు లిప్ కిస్ సీన్లు బాగా అచ్చొచ్చాయి. అందుకే సాహసం శ్వాసగా సాగిపో చిత్రంలోనూ.. ఈ సీన్స్ స్పెషల్ అట్రాక్షన్ అంటున్నాయి యూనిట్ వర్గాలు. ఈ మూవీ ఇప్పటికే రిలీజ్ సంబరాల్లో ఉండాలి. అయితే.. దసరా పండుగ చేసుకోవాల్సిన అఖిల్.. దీపావళికి డిసైడ్ అవడంతో.. చైతూ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించి.. రొమాంటిక్ హంగామా స్టార్ట్ చేయబోతున్నాడు చెర్రీ.