Begin typing your search above and press return to search.
`లవ్ స్టోరి` బిజినెస్ ఆ రేంజులోనా?
By: Tupaki Desk | 3 Jun 2020 6:15 AM GMTసెన్సిబుల్ డైరెక్టర్ కమ్ముల సినిమా అంటే మినిమమ్ గ్యారంటీ అనే టాక్ పరిశ్రమలో ఉంది. `ఆనంద్` నుంచి `ఫిదా` వరకు ఆయన సినిమాల ఫలితాలే అందుకు నిదర్శనం. ఒక్క `అనామిక` తప్ప అన్ని చిత్రాలు విజయాలను సాధించాయి. అంతేకాదు ఆయన సినిమాలు క్లీన్ ఎంటర్ టైనర్లుగా ఉంటాయి. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా.. మంచి ఫీల్.. ఎమోషన్స్.. కామెడీతో మేళవింపుగా ఉంటాయి. ఆయన సినిమాలు చూశాక ఒక అహ్లాదకరమైన అనుభూతిని పొందుతాం. అందుకే ఆ పర్‌ఫెక్షన్ కోసం సినిమా సినిమాకి చాలా టైమ్ తీసుకుంటారాయన.
ప్రస్తుతం నాగచైతన్య- సాయిపల్లవి జంటగా ఓ బ్యూటీఫుల్ `లవ్‌స్టోరి`ని రూపొందిస్తున్నారు. `ఫిదా` తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఈ నయా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారాయన. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. హే పిల్లా పాటకు చక్కని స్పందన వచ్చింది. పాటలు సినిమాపై అంచనాలను పెంచాయి. మేలో సమ్మర్ స్పెషల్‌గా విడుదల కావాల్సి ఉన్నా అనూహ్యంగా మహమ్మారీ వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే.
తాజాగా ఈ సినిమా బిజినెస్ కి సంబంధించిన వేడెక్కించే అప్ డేట్ అందింది. మజిలీ- వెంకీమామ లాంటి హిట్ చిత్రాల్లో నటించిన చైతూకి రేంజు పెరిగిందని తాజా బిజినెస్ చెబుతోంది. ఇప్పటికే నాన్ థియేట్రికల్ బిజినెస్ 16కోట్లు పలకగా.. డిజిటల్ రైట్స్ కి 6.3కోట్లు పలికిందట. హిందీ డబ్బింగ్ రైట్స్ కోసం 4కోట్లు .. శాటిలైట్ కోసం 5.7 కోట్లు చెల్లించేందుకు డీల్ కుదిరింది. డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ఆహా చేజిక్కించుకోగా శాటిలైట్ రైట్స్ ని `మా`టీవీ దక్కించుకుందని తెలుస్తోంది. లవ్ స్టోరి దసరా రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్నారు.