Begin typing your search above and press return to search.

`ల‌వ్ స్టోరి`లో `100 ప‌ర్సంట్ లవ్` ఉందా?

By:  Tupaki Desk   |   20 March 2020 1:30 AM GMT
`ల‌వ్ స్టోరి`లో `100 ప‌ర్సంట్ లవ్` ఉందా?
X
శేఖర్‌ కమ్ముల సినిమా అంటే మినిమమ్‌ గ్యారెంటీ అనే గుర్తింపు చిత్ర పరిశ్రమలో ఉంది. `ఆనంద్‌` నుంచి `ఫిదా` వరకు ఆయన సినిమాల ఫలితాలే అందుకు నిదర్శనం. ఒక్క `అనామిక` తప్ప అన్ని చిత్రాలు విజయాలను సాధించాయి. అంతేకాదు ఆయన సినిమాలు క్లీన్‌ ఎంటర్ టైనర్లుగా ఉంటాయి. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా.. మంచి ఫీల్‌.. ఎమోషన్స్.. కామెడీతో మేళవింపుగా ఉంటాయి. ఆయన సినిమాలు చూశాక ఒక అహ్లాదకరమైన అనుభూతిని పొందుతాం. అందుకే ఆ పర్ ఫెక్షన్‌ కోసం సినిమా సినిమాకి చాలా టైమ్‌ తీసుకుంటారాయన. తాజాగా నాగచైతన్య- సాయిపల్లవి జంటగా ఓ బ్యూటి ఫుల్‌ `లవ్ స్టోరి`ని రూపొందిస్తున్నారు.

`ఫిదా` తర్వాత చాలా గ్యాప్‌ తీసుకుని ల‌వ్ స్టోరిని తెరకెక్కిస్తున్నారాయన. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పాటలు ఆకట్టుకున్నాయి. సినిమాపై అంచనాలను పెంచాయి. అందులో `హే పిల్లా` పాట శ్రోతలను మైమరిపిస్తోంది. అయితే కరోనా కారణంగా సినిమా విడుదలపై సందిగ్ధం నెలకొంది. తాజాగా చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది. మేలో సమ్మర్‌ స్పెషల్ గా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది. మండే వేసవి లో ఐస్‌లాంటి చిత్రమవుతుందని చిత్ర బృందం చెబుతోంది.

ఇక `మజిలీ` స‌క్సెస్ తో మంచి ఫామ్ లో ఉన్న చైతూ.. ఫిదా లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ తో స్పీడ్ మీద‌ ఉన్న సాయిపల్లవి తొలిసారి కలిసి ఇందులో నటిస్తున్నారు. ఇటీవల `వెంకీమామ`తో మంచి విజయాన్ని అందుకున్న చైతూ ఈ సినిమాతో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకుంటాడా? అన్న‌ది స‌స్పెన్స్ గా మారింది. చైతూ- పల్లవిల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అయ్యిందా లేదా? అన్న‌ది ట్రైల‌ర్ వ‌స్తే కానీ పూర్తిగా తేల‌దు. కేవ‌లం పోస్ట‌ర్లు... టీజ‌ర్ల‌తో కొన్ని జిమ్మిక్కులు చేస్తారేమో కానీ ట్రైల‌ర్ మోసం చేయ‌దు. ఇక క‌మ్ముల బ్రాండ్ ఈసారి ఎంత‌వ‌ర‌కూ వ‌ర్క‌వుటవుతుంది? అన్న‌ది కూడా చూడాలి. ఇక 100 ప‌ర్సంట్ ల‌వ్ చిత్రంతో చైత‌న్య బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నాడు. త‌న కెరీర్ లో ఏమాయ చేశావే ఒక త‌ర‌హా ల‌వ్ స్టోరి అయితే 100 ప‌ర్సంట్ ల‌వ్ ఇంకో త‌ర‌హా. సుకుమార్ తెర‌కెక్కించిన 100 ప‌ర్సంట్ లవ్ పూర్తి క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్ టైన‌ర్.. దాంతో పోలిస్తే క‌మ్ముల ల‌వ్ స్టోరి పూర్తిగా డిఫ‌రెంట్ సెన్సిబిలిటీస్ తో ఉంటుంది. మ‌రి ఈసారి ల‌వ్ స్టోరీతో చైతూ హిట్టు కొడ‌తాడా లేదా? అన్న‌ది చూడాలి.