Begin typing your search above and press return to search.

నాగచైతన్య పెళ్లయిపోయిందోచ్..

By:  Tupaki Desk   |   30 April 2016 11:17 AM GMT
నాగచైతన్య పెళ్లయిపోయిందోచ్..
X
అక్కినేని కుటుంబ కథానాయకుడి పెళ్లి ఇంత హఠాత్తుగా.. చడీచప్పుడు లేకుండా జరిగిపోవడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా..? ఇది నిజం పెళ్లి కాదులెండి. సినిమా పెళ్లి. తన కొత్త సినిమా ‘ప్రేమమ్’ కోసం పెళ్లికొడుకుగా మారాడు చైతూ. ఈ సినిమా క్లైమాక్స్ పెళ్లితోనే ముగుస్తుంది. ఆ సన్నివేశాల చిత్రీకరణ రామోజీ ఫిలిం సిటీలో పూర్తయింది. అక్కడ ఓ భారీ పెళ్లి సెట్ వేసి.. చైతూ పెళ్లి సన్నివేశాల్ని చిత్రీకరించారు. శ్రుతి హాసన్ తో పాటు కీలక సినిమాలోని కీలక పాత్రధారులు చాలామంది ఈ సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొన్నారు. ఒక కుర్రాడి యవ్వనంలోని మూడు దశల్ని మూడు ప్రేమకథలుగా చూపించే సినిమా ‘ప్రేమమ్’. అతడి తొలి ప్రేమతో మొదలై.. పెళ్లితో ఈ సినిమా ముగుస్తుంది.

చైతూ ఫస్ట్ లవ్ గా మలయాళంలో నటించిన అనుపమ పరమేశ్వరనే నటించగా.. రెండోసారి అతణ్ని ప్రేమలోకి దించే లెక్చరర్ పాత్రలో శ్రుతి హాసన్ నటిస్తోంది. ఐతే చివరగా చైతూను పెళ్లాడే అమ్మాయి ఎవరన్నది సస్పెన్స్ గా పెట్టాడు డైరెక్టర్ చందూ మొండేటి. ఈ షెడ్యూల్ తో ‘ప్రేమమ్’ షూటింగ్ దాదాపుగా పూర్తయినట్లే చెబుతున్నారు. ఇక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మీద దృష్టిపెట్టబోతున్నారు. మలయాళ ఒరిజినల్ కు సంగీతం అందించిన రాజేష్ మురుగేశన్ తో పాటు ఆ ఇండస్ట్రీకే చెందిన గోపీసుందర్ ఈ చిత్రానికి సంగీతాన్నందిస్తున్నారు. జులై మూడో వారంలో ఈ సినిమాను రిలీజ్ చేయాలన్నది ప్లాన్. దాని కంటే ముందు ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు చైతూ.