Begin typing your search above and press return to search.

స్పీడ్ ఎక్కువైతే రిస్క్ చైతూ

By:  Tupaki Desk   |   9 March 2016 11:30 AM GMT
స్పీడ్ ఎక్కువైతే రిస్క్ చైతూ
X
అక్కినేని నాగ చైతన్య ఇప్పుడు మంచి జోరు మీదున్నాడు. ప్రస్తుతం మలయాళ మూవీ ప్రేమమ్ రీమేక్ ని శరవేగంగా కంప్లీట్ చేస్తున్నాడు చైతూ. ఇందులో మూడు వేరియషన్స్ ఉండే పాత్ర కోసం మూడు రకాల గెటప్స్ లో కనిపించనున్నాడు. మరోవైపు గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో చేసిన సాహసం శ్వాసగా సాగిపో చిత్రం కూడా రిలీజ్ కి దాదాపు రెడీగా ఉంది. కొంత పార్ట్ షూటింగ్ జరిపితే ఈ చిత్రం కూడా విడుదలయిపోతుంది.

ప్రేమమ్ రీమేక్ ని 4-5 నెలల్లోనే షూటింగ్ కంప్లీట్ చేస్తున్న ఈ అక్కినేని హీరో.. ఇప్పుడు తన తరువాతి ప్రాజెక్టులపై కూడా దృష్టి పెట్టాడు. కోలీవుడ్ డైరెక్టర్ సెల్వరాఘవన్ తో ఓ ద్విభాషా చిత్రం చేసేందుకు నాగచైతన్య సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఈ డైరెక్టర్ కి తన ఇంట్రెస్ట్ చెప్పడంతో.. సెల్వరాఘవన్ కూడా స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టేశాడు. ఈ డైరెక్టర్ చెప్పిన స్క్రిప్ట్ చాలా నచ్చడంతో ఈ స్టోరీపై చైతూ బాగా ఆసక్తిగా ఉన్నాడని తెలుస్తోంది. మరోవైపు ఇది తెలుగు - తమిళ్ భాషల్లో రూపొందే చిత్రం కావడంతో.. మరింతగా దృష్టి పెట్టాడని తెలుస్తోంది.

ఇక ఇప్పటికే నాగార్జునకు సోగ్గాడే చిన్నినాయన వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన కళ్యాణ్ కృష్ణతో కూడా చైతూ సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు. ఈ ఇద్దరిలో ఎవరు ఫైనల్ స్క్రిప్ట్ తో ముందుగా వస్తే ఆ సినిమా మొదలుపెట్టేందుకు రెడీ అయ్యాడు చైతూ. చేతిలో రెండు సినిమాలు, క్యూ లో రెండు సినిమాలు.. స్పీడ్ బాగానే ఉన్నా.. మరీ ఇంత స్పీడ్ అంటే రిస్క్ పెరుగుతుందనే సలహాలు ఇస్తున్నారు ఇండస్ట్రీ జనాలు.