Begin typing your search above and press return to search.

‘సవ్యసాచి’ కాన్సెప్ట్ అదిరిందిగా..

By:  Tupaki Desk   |   7 Sep 2017 2:16 PM GMT
‘సవ్యసాచి’ కాన్సెప్ట్ అదిరిందిగా..
X
సవ్యసాచి అంటే.. రెండు చేతులతోనూ ఒకేలా పని చేయగల.. నైపుణ్యం చూపించగలవాడని అర్థం. ఈ లక్షణాలున్న వాడు కాబట్టే అర్జునుడికి ‘సవ్యసాచి’ అనే పేరొచ్చింది. ఇప్పుడు ఇదే టైటిల్‌ తో అక్కినేని నాగచైతన్య హీరోగా యువ దర్శకుడు చందూ మొండేటి ఒక సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్.. దాని డిజైన్ పెద్ద చర్చనీయాంశంగా మారింది టాలీవుడ్లో. ఐతే సవ్యసాచి అనే పేరుకున్న అర్థాన్ని చందూ సినిమాలో ఎలా జస్టిఫై చేస్తాడు.. ఈ సినిమా కాన్సెప్ట్ ఏమై ఉంటుంది అన్న ఆసక్తికర చర్చ జరుగుతున్న టైంలోనే నాగచైతన్య ఈ సినిమా కాన్సెప్ట్ గురించి ఆసక్తికర విశేషాలు బయటపెట్టాడు.

ఈ చిత్రంలో కథానాయకుడి ఎడమచేయి అతడి అధీనంలో ఉండదట. కుడి చేతికి ఉన్నట్లే ఆ చేతికి కూడా అదే స్థాయిలో శక్తి.. నైపుణ్యం ఉంటుందట. కానీ ఆ చేయి అతడి కంట్రోల్లో ఉండదట. మెదడుకు.. ఆ చేతికి కనెక్షనే ఉండదట. దీంతో హీరో ప్రమేయం లేకుండా.. వేరే వ్యక్తి చేతి లాగా ఆ చేయి స్వతంత్రంగా ప్రవర్తిస్తుందట. దీని వల్ల హీరోకు లాభం చేకూరిందా.. నష్టం జరిగిందా.. అతను ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నాడన్నదే ఈ చిత్ర కథ అని చైతూ తెలిపాడు. వినడానికి ఈ కాన్సెప్ట్ భలే వెరైటీగా.. ఎగ్జైటింగ్ గా ఉంది కదూ. ‘గజిని’ సినిమా గుర్తొస్తోంది ఈ కాన్సెప్ట్ వింటుంటే. ఐతే దీన్ని చందూ సినిమాలో ఎంత ఆసక్తికరంగా డీల్ చేస్తాడన్నదాన్ని బట్టి సినిమా ఏ స్థాయికి వెళ్తుందన్నది ఆధారపడుతుంది. ఈ చిత్రం ఈ నెల 20న ఏఎన్నార్ జయంతి సందర్భంగా ప్రారంభోత్సవం జరుపుకుంటుందట. నవంబర్లో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందట. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.