Begin typing your search above and press return to search.

కమ్ముల సాయంతో చైతూ రికార్డ్‌ కొట్టాడు

By:  Tupaki Desk   |   4 Feb 2020 8:00 PM IST
కమ్ముల సాయంతో చైతూ రికార్డ్‌ కొట్టాడు
X
ఓవర్సీస్‌ బాక్సాఫీస్‌ వద్ద కొందరు చిన్న హీరోలు కూడా మిలియన్‌ డాలర్లను వసూళ్లు చేశారు. కాని నాగచైతన్య మాత్రం మనం మినహా అక్కడ పెద్దగా సందడి చేసిన సినిమా ఏదీ లేదు. మనంను మినహాయిస్తే చైతూకు ఓవర్సీస్‌ లో మంచి ఫిగర్‌ ఇప్పటి వరకు నమోదు అవ్వలేదు. కాని ఈసారి లవ్‌ స్టోరీ సినిమాతో ఆ లోటు తీరబోతున్నట్లుగా అనిపిస్తుంది. దర్శకుడు శేఖర్‌ కమ్ములతో కలిసి రాబోతున్న చైతూ 'లవ్‌ స్టోరీ' చిత్రంతో ఈజీగా మిలియన్‌ మార్క్‌ దక్కించుకోవడం ఖాయం అని.. లక్‌ బాగుంటే రెండు మిలియన్‌ క్లబ్‌ లో కూడా చైతూ చేరవచ్చు అంటున్నారు.

శేఖర్‌ కమ్ములకు ఓవర్సీస్‌ బాక్సాఫీస్‌ వద్ద మంచి పట్టు ఉంటుంది. అక్కడ ప్రేక్షకులు కమ్ముల సినిమా అంటే క్యూ కట్టేస్తారు. ఫిదా అక్కడ రెండు మిలియన్‌ ల వసూళ్లను దక్కించుకుంది అంటే ఆయన క్రేజ్‌ ఎలా ఉందో చెప్పుకోవచ్చు. మంచి సినిమాగా టాక్‌ దక్కించుకుంటే లవ్‌ స్టోరీ కూడా ఈజీగా అక్కడ రెండు మిలియన్‌ ల డాలర్లను వసూళ్లు చేస్తుందనే నమ్మకంను బయ్యర్లు కలిగి ఉన్నారు. అందుకే భారీ మొత్తాన్ని పెట్టేందుకు ముందుకు వచ్చారు.

గతంలో ఎప్పుడు లేని విధంగా చైతూ సినిమా ఓవర్సీస్‌ రైట్స్‌ ఏకంగా 5.5 మిలియన్‌ డాలర్లకు అమ్ముడు పోయినట్లుగా సమాచారం అందుతోంది. గతంలో చైతూ నటించిన ఏ సినిమాకు కూడా ఈ స్థాయిలో ఓవర్సీస్‌ రైట్స్‌ అమ్ముడు పోలేదు. మొత్తానికి చాలా కాలంగా ఊరిస్తున్న ఓవర్సీస్‌ రికార్డు కమ్ముల సాయంతో చైతూ కొట్టేలా ఉన్నాడంటూ ట్రేడ్‌ పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ చిత్రంలో సాయి పల్లవి ఉండటం కూడా అదనపు ఆకర్షణ. ఆమె కూడా ఓవర్సీస్‌ లో మంచి బజ్‌ ఉన్న హీరోయిన్‌. ఆ కారణం వల్ల కూడా ఈ చిత్రంకు ఆ స్థాయిలో బిజినెస్‌ అయ్యి ఉండవచ్చు అంటున్నారు. ఏదైతేనం చైతూ ఈసారి తన కెరీర్‌ బెస్ట్‌ ను ఓవర్సీస్‌ లో రికార్డు కొట్టబోతున్నాడు.