Begin typing your search above and press return to search.
ఏంటి చైతు-అప్పుడు నో ఇప్పుడు ఎస్
By: Tupaki Desk | 9 March 2018 9:17 AM GMTస్టార్ హీరోల వరసే అంత. ఒకసారి అవును అంటారు. మరోసారి వెంటనే మార్చేసి కాదు అంటారు. అక్కినేని హీరో నాగ చైతన్య చెబుతున్న మాటలు అలాగే ఉన్నాయి మరి. ప్రస్తుతం స్పీడ్ గా సినిమాలు చేస్తున్న యంగ్ హీరోస్ లో చైతునే ముందున్నాడు. గత ఏడాది ఒక హిట్టు ఒక డిజాస్టర్ సమానంగా అందుకున్న చైతన్య ఇప్పుడు కూడా స్పీడ్ ఏ మాత్రం తగ్గించలేదు. సవ్యసాచి షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా మరోవైపు శైలజారెడ్డి గారి అల్లుడుగా అల్లరి చేయడానికి రెడీ అయిపోతున్నాడు. ఒకే తరహా సినిమాలకు కట్టుబడకుండా ప్రయోగాలు చేయడానికి వెనుకాడని ఈ అక్కినేని హీరోకి లాస్ట్ ఇయర్ యుద్ధం శరణం పెద్ద షాకే ఇచ్చింది. అందుకే కథల విషయం కాస్త శ్రద్ధ పెడుతున్నాడు. తమ్ముడు కొత్త సినిమా విషయంలో ఎటు తేల్చుకోలేక ఇబ్బంది పడుతుంటే అన్న మాత్రం దూసుకుపోతున్నాడు.
రెండు వారాల క్రితం చైతు హీరోగా సమంతా హీరొయిన్ గా నిన్ను కోరి ఫేం శివ నిర్వాణ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందనుందని వార్తలు వచ్చాయి. ప్రేయసి అనే టైటిల్ కూడా అనుకున్నట్టు బలంగానే వినిపించింది. కాని తనను కలిసిన మీడియాతో అబ్బే అలాంటిది ఏమి లేదని కొట్టిపారేశాడు చైతు. తాజాగా శివ నిర్వాణతో సినిమా ఓకే అయ్యిందని, త్వరలోనే సెట్స్ పైకి వెళ్తుందని ప్రకటించాడు. ముందు నో ఉండదు అని చెప్పిన చైతు ఇప్పుడు ఎస్ చేస్తున్నాను అని చెప్పడం వెనుక కారణం ఏమై ఉంటుందా అని చర్చలు జరిగాయి.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం ముందు చైతు నో చెప్పింది తనకు సమంతాకు ఇచ్చే రెమ్యునరేషన్ విషయంలో ఏకాభిప్రాయం రాకపోవడం వల్లనట. పెళ్ళైనా సమంతా డిమాండ్ తగ్గకపోవడంతో ఇద్దరికీ కలిపి 7 కోట్ల దాకా అడిగినట్టు టాక్. ముందు వద్దు అనుకున్న నిర్మాత మధ్యేమార్గంగా మరో ఫిగర్ కోట్ చేయటంతో ప్రాజెక్ట్ ఓకే అయ్యిందని ఫిలిం నగర్ టాక్. అందులో తనదే 5 కోట్ల దాకా చైతు అడిగాడట. ఇది నిజమో కాదో కాని అక్కినేని హీరో డిమాండ్ మామూలుగా లేదే అనే చర్చ ప్రస్తుతం జోరుగా జరుగుతోంది.