Begin typing your search above and press return to search.

దర్శకుడికి సారీ చెప్పిన నాగ చైతన్య

By:  Tupaki Desk   |   20 Sep 2016 6:51 PM GMT
దర్శకుడికి సారీ చెప్పిన నాగ చైతన్య
X
''దర్శకుడు చందూని ఒక రీమేక్ చేయమని అడగటం చాలా పెద్ద తప్పే. ఈ సినిమా రిలీజయ్యాక నేను నీ సొంత కథతో ఎప్పుడైనా కూడా ఒక సినిమాను చేయడానికి రెడీగా ఉన్నాను. అలాగే ఈ ప్రొడ్యూసర్లకు కూడా సినిమా చేస్తాను'' అంటూ సెలవిచ్చాడు నాగ చైతన్య. అసలు కార్తికేయ వంటి ఎక్సట్రా ఆర్డినరీ సినిమాను తీసిన ఈ దర్శకుడు.. ఇలా రీమేక్ ఎందుకు చేశాడు అంటే.. కేవలం నాగార్జునపై అభిమానం - నాగ చైతన్య అంటే ఉన్న ఇష్టం కారణంగానే చేశాడని తెలుస్తోంది. అదే విషయాన్ని గత రాత్రి 'ప్రేమమ్' ఆడియో లాంచ్ కు వచ్చిన వక్తలందరూ దాదాపు స్పష్టం చేశారు.

ఇకపోతే ఈ కార్యక్రమంలో తదుపరి మాట్లాడిన చైతన్య.. ''బాధ సంతోషం హిట్టయినా ఫ్లాపైనా కొన్ని సంవత్సరాల నుంచి నన్ను సపోర్టు చేస్తోంది అక్కినేని అభిమానులే. ఒరిజినల్ కంటే బాగా చేద్దాం.. ఆ హీరోకంటే బాగా చేద్దాం.. అలాంటి ఇంటెన్షన్ తో ఈ సినిమా చేద్దామని అనుకోలేదు. మేం అక్కడున్న టెక్నీషియన్లను అందరినీ ఎప్రిషియేట్ చేస్తూ ఈ సినిమా తీశాం. అలాగే తెలుగు ప్రేమమ్ రిలీజయ్యాక అక్కడి టెక్నిషియన్లు ఇక్కడ వారందరినీ అభినందిస్తారు'' అని చెప్పాడు. ఈ సినిమాలో అందరూ ఎంతో గొప్ప ఎఫర్ట్ పెట్టి చేశారని.. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు నాగ చైతన్య.