Begin typing your search above and press return to search.

ఇంద్రగంటితో చైతు ప్రాజెక్ట్ ఆగలేదట

By:  Tupaki Desk   |   29 Nov 2016 4:05 PM GMT
ఇంద్రగంటితో చైతు ప్రాజెక్ట్ ఆగలేదట
X
మరి కొన్ని రోజుల్లో అక్కినేని నాగచైతన్య కొత్త సినిమా షూట్ స్టార్ట్ అయిపోతోంది. సోగ్గాడే చిన్ని నాయన డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ.. చైతు-రకుల్ ప్రీత్ సింగ్ జంటగా సినిమా మొదలుపెట్టేస్తున్నాడు. దీంతో పాటే మరికొన్ని సినిమాలకు కూడా చైతు లైన్ లో పెట్టాడు కానీ.. ఇంద్రగంటి మోహన్ కృష్ణ ప్రాజెక్టుపై ఓ రూమర్ వచ్చింది.

కొత్త దర్శకుడు కృష్ణతో చేయాల్సిన ఓ ప్రాజెక్ట్ విషయంలో నాగచైతన్య వెనక్కి తగ్గితే.. అది ఇంద్రగంటి మోహన్ కృష్ణ ప్రాజెక్ట్ అంటూ వార్తలు ప్రచురితమయ్యాయి. నిజానికి చైతు ఓకే చెప్పిన మూడు సినిమాల దర్శకుల పేర్లలోను కృష్ణ ఉండడమే ఈ కన్ఫూజన్ కు కారణం.. సోగ్గాడే డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ.. ఇంద్రగంటి మోహన్ కృష్ణ.. కొత్త దర్శకుడు కృష్ణ.. ఇలా ముగ్గురు కృష్ణలు ఉండడంతో రద్దయిన ప్రాజెక్టు విషయంలో గందరగోళం ఏర్పడింది. ఇప్పుడు ఇంద్రగంటితో చైతు మూవీ ఉందని.. ఈ ప్రాజెక్ట్ ఆగే ప్రసక్తి లేదని తెలుస్తోంది.

ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు తుది దశకు చేరుకోగా.. జనవరి నుంచి క్యాస్టింగ్-టెక్నీషియన్లను ఎంపిక చేయనున్నారని తెలుస్తోంది. అలాగే ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ కూడా ప్లాన్ చేశాడట ఇంద్రగంటి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/